E-Paper
Advertisement

Vijay Deverakonda: 26 కోసం వెయిటింగ్.. కెమెరామెన్ ప్రశ్నకు విజయ్ దిమ్మతిరిగే సమాధానం!

Vijay Deverakonda: 26 కోసం వెయిటింగ్.. కెమెరామెన్ ప్రశ్నకు విజయ్ దిమ్మతిరిగే సమాధానం!
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరొకవైపు వ్యక్తిగతంగా కూడా నిత్యం వార్తలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna)తో విజయ్ ఏడడుగులు వేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో గత నాలుగేళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఎప్పుడు ఎక్కడ రివీల్ కాలేదు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా ఈనెల 26వ తేదీన విజయ్ – రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు వీరిద్దరూ నిన్న రాత్రి వేర్వేరుగా ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

26 కోసం వెయిటింగ్.. విజయ్ దిమ్మతిరిగే కౌంటర్..

ఇకపోతే వీరిద్దరూ సడన్గా ఎయిర్ పోర్ట్ లో కనిపించేసరికి అత్యుత్సాహంతో ఒక కెమెరామెన్ విజయ్ దేవరకొండను..” 26 కోసం వెయిటింగ్” అనడంతో అందుకు విజయ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. విజయ్ మాట్లాడుతూ.. “వెయిటింగ్ ఎందుకు.. ఎలాగైనా వస్తుంది కదా 26th ” అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక పెళ్లి కోసం వారిద్దరు జైపూర్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫిబ్రవరి 26వ తేదీన వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కెమెరామెన్ తన అత్యుత్సాహాన్ని విజయ్ ముందు ప్రస్తావించారు. కానీ ఆయన మాత్రం తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చి తన వివాహం గురించి బయట పెట్టకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెళ్లి పనుల్లో బిజీ..

Advertisement

ఉదయపూర్ లోని అత్యంత ప్రాచీన చారిత్రక కోటలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కాబోతున్నారని సమాచారం. అలాగే మార్చి 4వ తేదీన హైదరాబాదులో ప్రత్యేకంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారట. ఇక ఇన్ని జరుగుతున్నా.. వీరు మాత్రం అధికారికంగా ఈ విషయంపై ప్రకటించకపోవడం గమనార్హం.

ప్రేమకు బీజం అక్కడే..

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయారు. 2018 లో వచ్చిన గీత గోవిందం సినిమాతో రష్మిక ప్రేమలో పడిన విజయ్ దేవరకొండ అప్పటినుంచి ఈ రహస్య బంధాన్ని మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.

Advertisement

ALSO READ:Swayambhu Movie: నాది ఏఐ సినిమా కాదు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నిఖిల్!

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలు..

విజయ్ దేవరకొండ చిత్రాల విషయానికొస్తే.. చివరిగా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ప్రస్తుతం రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి సినిమాలో కూడా నటిస్తున్నారు. రణబాలి చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా.. 19వ శతాబ్దపు కాలము నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే రౌడీ జనార్ధన్ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈయన ఖాతాలో జనగణమన సినిమా కూడా ఉంది కానీ దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×