E-Paper
Advertisement

Upcoming Movies in Theater : రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

Upcoming Movies in Theater : రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
Advertisement

Upcoming Movies in Theater : ప్రతి నెల ప్రతి వారం సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఏప్రిల్, మే నెలలో సమ్మర్ స్పెషల్ సినిమాలు బోలెడు థియేటర్లోకి రాబోతున్నాయి.. గత నెలలో సినిమాలతో పోలిస్తే ఈ నెలలో సినిమాలో బోలెడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ఇన్ అయితే సొంతం చేసుకున్నాయి. ఇక ఈ నెల ముగిసింది మే నెల కొత్త సినిమాలను తెచ్చేస్తుంది. మే ఒకటో తారీఖున బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి.. మరి ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం..

ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. 

మే 1న పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు యాక్షన్, డ్రామా, మాస్ యాక్షన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. అవేంటంటే…

జెట్లీ..

Advertisement

టాలీవుడ్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జెట్లీ.. గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మత్తు వదలరా సినిమా డైరెక్టర్ రితేష్ రాణా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. రియా సింఘా హీరోయిన్. సినిమా గ్లింప్స్, ట్రైలర్ చాలా హిలేరియస్‌గా ఉన్నాయి.. ముఖ్యంగా సత్య కామెడీ పీక్స్‌లో ఉంటుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ మే డే సందర్భంగా రేపు థియేటర్లలోకి రాబోతుంది…

ఓ తండ్రి కథ..

కుటుంబ పెద్దగా ఉన్న తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు ఎలాంటి కష్టాన్ని అనుభవిస్తాడు? పిల్లలు ఎదుగుదలని తన ఎదుగుదలగా భావిస్తాడు.. ఒక జీవికి తండ్రి అవసరం చాలా ఉంటుంది. తండ్రి గొప్పతనాన్ని హృదయాన్ని హత్తుకునేలా చూపించే భావోద్వేగ చిత్రం ‘ఓ తండ్రి కథ’.. మే 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, విజయలక్ష్మీ, తోట సుబ్బారావు, వి. కరుణాకర్ కీలక పాత్రల్లో నటించారు.. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరికెక్కుతుంది..

గాయపడ్డ సింహం..

Advertisement

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం‘ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు.. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ట్రైలర్, మిగిలిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. అంతే కాదు ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా మొదలు పెట్టడంతో సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read :రష్మిక ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్..

వీటితో పాటుగా మరో రెండు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. ఏప్రిల్ 30న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కరా మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ పై ఆసక్తి నెలకొంది.. మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడుతున్న సినిమాలలో ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×