E-Paper
Advertisement

ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!

ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!
Advertisement

Bellamkonda Sai Srinivas: గత కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai Srinivas) ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాక్షిగా తన ప్రేయసి కావ్య రెడ్డి (Kavya Reddy)మెడలో కుటుంబ సభ్యుల సమక్షంలో మూడు ముళ్ళు వేసి జీవిత భాగస్వామిగా ఆమెను అంగీకరించారు. 2026 ఏప్రిల్ 29 రాత్రి 11:05 గంటల సమయంలో జరిగిన ఈ వివాహ వేడుక అందరిని ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబాల పెద్దలు , సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.

హాజరైన ప్రముఖులు..

ముఖ్యంగా ఈ వివాహానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డిఆర్ నాయుడు వంటి ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సాంప్రదాయ వేద పద్ధతిలో జరిగిన ఈ వివాహం అటు ఆధ్యాత్మికత నిండుగా ఘనంగా సాగింది. లక్ష్మీ నారాయణులులా నూతన జంట అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే పెళ్లి తర్వాత ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల రిసెప్షన్ అక్కడే..

Advertisement

ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిలు తిరుమలలో వివాహం చేసుకున్నప్పటికీ అందరి కోసం హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మే ఒకటవ తేదీన హైదరాబాద్ వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , సినీ పెద్దలు ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.

కావ్య రెడ్డి కెరియర్:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు భార్యగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కావ్య రెడ్డి సినిమా రంగానికి చెందినవారు కాదు.. ఈమె తాత జడ్జి కాగా.. ఈమె నాన్న లాయర్ గా వ్యవహరిస్తున్నారు. అలా ప్రముఖ న్యాయవాది కుటుంబం నుంచి వచ్చిన ఈమెకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి ఇప్పుడు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్..

Advertisement

స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి పరిచయంలో వచ్చిన చిత్రం అల్లుడు శీను. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. స్పీడున్నోడు, జయ జానకి నాయక , సాక్ష్యం, కవచం, సీతా, రాక్షసుడు , అల్లుడు అదుర్స్ అంటూ పలు చిత్రాలు చేశారు ఇక హిందీలో తొలిసారి ఛత్రపతి రీమేక్ సినిమాలో నటించారు కానీ ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఇక చివరిగా భైరవం , కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు టైసన్ నాయుడు, హైందవ అనే సినిమాలను లైన్లో పెట్టారు. మరి ఈ సినిమాలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు స్టార్ సక్సెస్ అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×