Upcoming Movies In Theater: కొత్త ఏడాది వచ్చేసింది. కొత్త సినిమాలు కూడా రాబోతున్నాయి. ప్రతి ఏడాది జనవరిలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోలు సినిమాలు బరిలో దిగుతాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉందని తెలుస్తుంది. జనవరి తొలి వారంలో విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు విడుదల అయ్యాయి. సైక్ సిద్ధార్థ’, రామ్ కిరణ్–మేఘ ఆకాశ్ జంటగా వచ్చిన ‘సఃకుటుంబానాం’, గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ‘వనవీర’ జనవరి 1న ప్రేక్షకులను పలకరించాయి. అలాగే జనవరి 2 న ఘంటసాల ది గ్రేట్’, మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ‘నీలకంఠ’ రిలీజ్ అయ్యాయి. ఇక నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా రిలీజై మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నుంచి కల్కి తర్వాత రాబోతున్న మూవీ రాజా సాబ్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ జనాలను బాగా ఆకట్టుకుంది. అలాగే సినిమా నుంచి బయటికి వచ్చిన పాటలు కూడా జనాలను మెప్పించాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. దాంతో ఈ సినిమాని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.. జనవరి 9న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..
స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్.. ఈ సినిమా చివరి సినిమా కావడంతో జనాలు చూసేందుకు ఇప్పటినుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హెచ్ వినోద్ దస్కతు వహించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ సినిమాతో ఈ సినిమా పోటీ పడుతుంది.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయ నటించిన తాజా చిత్రం పరాశక్తి. పొలిటికల్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న పరాశక్తిలో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. అథర్వ, రవి మోహన్, బాసిల్ జోసెఫ్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు.. ఈ మూవీ ముందుగా జనవరి 14న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ ని ముందుకు తీసుకొచ్చారు జనవరి 10న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ తో అంచనాలను పెంచేసుకుంది. దాంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ని వరుసగా వదులుతున్నారు. రీసెంట్ గా వచ్చిన వామ్మో వాయ్యో సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు.. ఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
వీటితో పాటుగా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతిః.. ఈ సినిమా జనవరి 23న థియేటర్లలోకి రాబోతుంది… వీటితోపాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొత్తానికి జనవరిలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్గా నిలుస్తుందో చూడాలి.