Gripping K-dramas OTT : కె-డ్రామాలంటే ప్రాణం ఇచ్చే క్రేజీ ఫ్యాన్స్ ఇండియాలో లెక్కలేనంత మంది ఉన్నారు. 2025 సంవత్సరం కొరియన్ థ్రిల్లర్స్ కి మంచి అద్భుతమైన ట్రీట్ ఇచ్చింది. లీ యూ-మి, సో జి-సబ్, షిన్ మిన్-ఆహ్, కిమ్ గో-యూన్ లాంటి కొరియన్ స్టార్స్ నటించిన సిరీస్ లు ఆడియన్స్ ను స్క్రీన్ కి అతుక్కుపోయేలా చేశాయి. ప్రతీకారం, మిస్టరీ, సైకలాజికల్ ట్విస్ట్స్… వంటి అంశాలన్నీ మెండుగా ఉన్న కొరియన్ థ్రిల్లర్స్ కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న టాప్ కొరియన్ థ్రిల్లర్స్ గురించి చూద్దాం.
పార్క్ హ్యుంగ్-సిక్ మొట్ట మొదటిసారి డార్క్ రోల్‌లో నటించిన సిరీస్ ఇది. సియో డాంగ్-జున్ అనే యాంబిషస్ బిజినెస్ మ్యాన్ పాత్రలో నటించాడు. కంపెనీ స్వాధీనం చేసుకోవాలని కలలు కనే హీరో శక్తివంతుల చేతిలో దాదాపు చనిపోతాడు. ఆ తరువాత ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. హ్యుంగ్-సిక్ ఇప్పటివరకు స్వీట్ లవర్ బాయ్ రోల్స్ చేశాడు. కానీ ఇందులో మాత్రం పూర్తిగా డిఫరెంట్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ఇంటెన్స్ డ్రామా, ట్విస్ట్స్ తో ఈ కే డ్రామా అద్భుతంగా ఉంటుంది.
‘ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ’ ఫేమ్ పార్క్ యున్-బిన్ ఇందులో న్యూరో సర్జన్ రోల్ లో నటించాడు. గురువు వల్ల ఓ స్కాండల్ లో లైసెన్స్ కోల్పోతాడు. తరువాత ఏకంగా ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. తనను అడ్డంగా ఇరికించిన గురువుపై ప్రతీకారం నేపథ్యంలో కథ సాగుతుంది. యున్-బిన్ బహుముఖ నటన ఆకట్టుకుంటుంది. ఇక ట్విస్ట్స్ లతో టెన్షన్ పీక్‌లో ఉంటుంది. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
సో జి-సబ్, లీ జున్-హ్యూక్ స్టారర్ హార్డ్ కోర్ యాక్షన్ థ్రిల్లర్. తమ్ముడి హత్యకు అన్న ప్రతీకారం తీర్చుకునే స్టోరీ. రెండు గ్యాంగ్స్ మధ్య వార్ తో బ్లడీ బ్లడ్ బాత్ అన్నట్టుగా ఉంటుంది ఒక్కో సీన్స్. ముందుగా స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది. కానీ హీరో తమ్ముడు చనిపోవడంతో అసలు కథ మొదలవుతుంది. హీరోని చూస్తే కుంటి కాలితో ఏం చేస్తాడు ? అన్పిస్తుంది. కానీ అతని గతం, ఒక్కొక్కడినీ హీరో ఊచకోత కోసే విధానం చూస్తే బుర్రబద్దలే. వయలెంట్ యాక్షన్ సీక్వెన్సెలు హైలైట్ గా ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ ను ఊపేసిన ఈ సిరీస్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.
షిన్ మిన్-ఆహ్ నటించిన లిమిటెడ్ సిరీస్ ఇది. ఆరుగురు స్ట్రేంజర్స్ జీవితాలు ఒక విషాద ఘటనతో ముడిపడి ఉంటాయి. గతంలో చేసిన పాపాలు, అపరాధభావం, ప్రతీకారం… వంటి అంశాలతో నడిచే నాన్-లీనియర్ స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది. దీన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.
కిమ్ గో-యూన్, జియోన్ డో-యోన్ 10 ఏళ్ల తర్వాత కలిసిన డ్రామా ఇది. ఇద్దరు మహిళలు చేసిన నేరాలకు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి ? అనేది చూసి తీరాల్సిందే. ఈ సిరీస్ ను కూడా నెట్ ఫ్లిక్స్ లోనే చూడండి.
Read Also : ఓటీటీలోకి భారతదేశం చంద్రునిపైకి చేసిన చారిత్రాత్మక ప్రయాణం… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?