E-Paper
Advertisement

Upcoming Movies In Theater : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..

Upcoming Movies In Theater : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Upcoming Movies In Theater : గతవారంతో పోలిస్తే ఈ వారం అన్ని చిన్న సినిమాలే థియేటర్లలోకి రాబోతున్నాయి.. అందులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకు విభిన్న జానర్లలో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్లు మరోసారి కళకాలాడుతున్నాయి. రేపు శుక్రవారం రామ్‌, ఉపేంద్ర నటించిన ఆంధ్రా కింగ్ తాలుఖా, కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా, ధనుష్ బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే, హాలీవుడ్ యానిమేషన్ సినిమాలు జుటోపియా చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనేలా కనిపిస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

ఆంధ్రా కింగ్ తాలూకా..

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం `ఆంధ్ర కింగ్‌ తాలూకా`. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` ఫేమ్‌ మహేష్‌ బాబు పి దర్శకత్వం వహించిన ఈ మూవీలో లేటెస్ట్ యంగ్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది. నవంబర్ 27 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

జనతా బార్..

Advertisement

రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం జనతా బార్.. ఇందులో రాయ్ లక్ష్మీ, అమన్ ప్రీత్ సింగ్, దీక్షాపంత్, శక్తికపూర్, అనూప్ సోని, ప్రదీప్ రావత్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబరు 28న థియేటర్లలో విడుదల కానుంది.

స్కూల్‌ లైఫ్..

పులివెందుల మహేష్, షన్ను, సావిత్రి, సుమన్ తదితరులు నటించిన మూవీ స్కూల్ లైఫ్.. పులివెందుల మహేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విద్యార్థి జీవితం, స్నేహం, మీమీ-కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.. నవంబర్ 28 న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

మరువ తరమా..

Advertisement

చైతన్య వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మరువ తరమా.. నవంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీశ్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల ప్రధాన పాత్రల్లో నటించారు. టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా సీన్లు కూడా ఉంటాయని తెలుస్తుంది.. చిన్న సినిమాగా థియేటర్ లోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

బిజినెస్ మెన్..

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం బిజినెస్ మెన్.. గతంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది..

Also Read :సీరియల్స్ యాక్టర్స్ కు రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది..? అక్కడే ఎక్కువ…

మొత్తానికి ఈవారం తెలుగులో పది సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి.. ఆంధ్ర కింగ్ తాలూకా, అమర కావ్యం, స్కూల్‌లైఫ్, జనతా బార్, మరువ తరమా, బిజినెస్‌మేన్ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను చూసేందుకు సిద్దమైపోండి..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×