E-Paper
Advertisement

OTT Movie: గయ్యాళి పెళ్ళాం… మోనార్క్ మొగుడు… విడాకుల కోసం విన్నపాలు… ఓటిటిలోకి తమిళ రొమాంటిక్ మూవీ

OTT Movie: గయ్యాళి పెళ్ళాం… మోనార్క్ మొగుడు… విడాకుల కోసం విన్నపాలు… ఓటిటిలోకి తమిళ రొమాంటిక్ మూవీ

OTT Movie : థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తమిళ రొమాంటిక్ మూవీ ‘ఆన్ పావం పొల్లాతతు’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రియో రాజ్ మాళవిక మనోజ్ నటించిన ఈ సినిమా దాదాపు బాక్సాఫీస్ వద్ద  25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దీని స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని, స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది. ఈ స్టోరీ ఒక జంట పెళ్లి తరువాత ఎదుర్కొనే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కలైయరసన్ తంగవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ రొమాంటిక్ ‘ఆన్ పావం పొల్లాతతు’ అక్టోబర్‌లో థియేటర్ల వద్ద సందడి చేసింది. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ హక్కుల్ని JioHotstar సొంతం చేసుకుంది. నవంబర్ 28న ప్రీమియర్ అవుతున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. రియో ​​రాజ్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో భాషల్లో అందుబాటులో ఉండనుంది.

స్టోరీలోకి వెళ్తే

చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా అర్జున్ (రియో రాజ్) ఉద్యోగం చేస్తుంటాడు. అదే ఆఫీస్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా శ్రీజా (మలవికా మనోజ్) కూడా ఉంటుంది. ఇదరూ ప్రేమలో పడతారు. పెళ్లి కూడా జరిగిపోతుంది. హనీమూన్ ట్రిప్‌ ఊటీ వెళ్లి సూపర్ రొమాంటిక్‌గా గడుపుతారు. పెళ్లయ్యాక మొదటి 3 నెలలు రోజూ డేటింగ్ లాగానే ఉంటుంది. కానీ 6 నెలలు దాటగానే రియాలిటీ మొదలవుతుంది. అర్జున్ ట్రెడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కావడంతో భార్యను డామినేట్ చేయడం మొదలెడతాడు. శ్రీజా మాత్రం కెరీర్, ఫ్రెండ్స్‌తో పార్టీలు అనే ఫ్రీ మైండెడ్ తో ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు మొదలవుతాయి. శ్రీజా లేట్ నైట్ పార్టీకి వెళ్తే అర్జున్ ఇలా ఉండకూడదని కోప్పడతాడు. ఇద్దరి ఫోన్ పాస్‌ వర్డ్స్ కోసం ఫైట్ కూడా జరుగుతుంది.

Read Also : చచ్చినోడు చేసే హత్యలు… అంతుపట్టని కేసు… బుర్రకు పదును పెట్టే తమిళ థ్రిల్లర్

చివరికి ఇద్దరూ తట్టుకోలేక విడాకులు తీసుకుందాం అని డిసైడ్ అవుతారు. కోర్టుకి వెళ్తే జడ్జి 6 నెలలు కౌన్సెలింగ్ చేయండని ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. వాళ్ల లాయర్స్ ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్న జంటే. అర్జున్ లాయర్ కార్తిక్, శ్రీజా లాయర్ ప్రియా 5 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని, అదే రకమైన గొడవలతో విడిపోయారు. ఈ లాయర్లు ఇద్దరూ కలిసి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ దగ్గరవుతారు. ఈ ట్రాక్ కామెడీ సీన్స్ తో కడుపుబ్బా నవ్విస్తుంది. చివరికి ఈ జంట విడాకులు తీసుకుంటుందా ? మళ్ళీ ఊటీ ట్రిప్‌ కి వెళ్తుందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×