E-Paper
Advertisement

మొదటికొచ్చిన పర్సంటేజ్ పంచాయితీ?.. పవన్ కళ్యాణ్ భేటీపై యంగ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

మొదటికొచ్చిన పర్సంటేజ్ పంచాయితీ?.. పవన్ కళ్యాణ్ భేటీపై యంగ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Percentage Controversy:  పర్సంటేజ్ పంచాయితీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి మించిన ట్విస్ట్ లు కనిపిస్తున్నాయి. ఇదిగో ఎండ్ కార్డ్ పడిపోతుంది అనుకున్న ప్రతీసారి ఎదో రకంగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతూనే ఉంది. థియేటర్ల ఓనర్స్ పెడుతున్న పర్సంటేజ్ కండీషన్స్ వల్ల బాగా నష్టపోతున్నామంటూ ఇండస్ట్రీలో ఒక వర్గం ఒక వర్గం ఆందోళన చెందుతుంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన టాప్ ప్రొడ్యూసర్స్ అంతా ఒక్కటై, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాజమండ్రిలో కలిసి ఈ సమస్యలపై చర్చించడం చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, వృద్ధి సినిమాస్ వెంకట్ సతీశ్ కిలారు, ఎస్ఎల్వీ సినిమాస్ చెరుకూరి సుధాకర్ వంటి బడా నిర్మాతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. పరిశ్రమలోని ప్రధాన సమస్యలను డెప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని వారు ప్రకటించారు.

Advertisement

also read :‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా ఎండ్ కార్డ్.. చిరంజీవి ఎంట్రీతో సీన్ రివర్స్!

తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధీరజ్

Advertisement

అయితే ఈ భేటీ ఇండస్ట్రీలోని అంతర్గత విభేదాలను, అసంతృప్తులను ఒక్కసారిగా బయటపెట్టింది. పెద్ద నిర్మాతలు మాత్రమే వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలవడంపై యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిన్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని, ఈ వ్యవహారంపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమ అంటే కేవలం వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీసే నలుగురైదుగురు పెద్ద నిర్మాతలు మాత్రమే కాదని, ఇక్కడ వందలాది మంది చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలు కూడా ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కేవలం వాళ్లే వెళ్లి మాట్లాడేసుకోవడం కరెక్ట్ కాదు

పెద్ద సినిమాల మార్కెట్, వాటి సమస్యలు వేరని, చిన్న సినిమాల మనుగడ పూర్తిగా భిన్నమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ధీరజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లాంటి పోష్ ఏరియాలో వేయి గజాల స్థలంలో పది కోట్ల భారీ బడ్జెట్‌తో ఇల్లు కట్టుకునే వ్యక్తి ఎదుర్కొనే ఇబ్బందులు ఒకలా ఉంటాయని, అదే మణికొండ లాంటి ప్రాంతంలో రెండు వందల యాభై గజాల చిన్న ప్లాట్‌లో ఇల్లు కట్టే మధ్యతరగతి వ్యక్తి కష్టాలు ఇంకోలా ఉంటాయని చెప్పారు.

also read :మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?

ఇద్దరూ ఇళ్లే కడుతున్నప్పటికీ, వారి ఆర్థిక పరిమితులు, అవసరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తిగా వేరని పోల్చి చూపారు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆ టాప్ ప్రొడ్యూసర్స్, చిన్న సినిమాల వారిని కనీసం సంప్రదించలేదని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం వాళ్లే వెళ్లి మాట్లాడేసుకోవడం కరెక్ట్ కాదని ధీరజ్ ఓపెన్‌గా కామెంట్ చేశారు.

ఈ కామెంట్స్ ఏ కాంట్రవర్సీలకి దారి తీస్తాయో

ప్రస్తుతం నడుస్తున్న పర్సంటేజ్ వివాదంలో చిన్న నిర్మాతలు పడుతున్న ఇబ్బందులను, వారి వెతలను ఎవరూ సరైన కోణంలో అర్థం చేసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చిన్న, మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్ అంతా ఒక తాటిపైకి వచ్చి, ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవనున్నట్లు ధీరజ్ అనౌన్స్ చేశారు. అక్కడ చిన్న సినిమాల థియేటర్ల లభ్యత, పంపిణీ వ్యవస్థలోని లోపాలను వివరించనున్నట్లు చెప్పారు.

also read :బాబీ సినిమా మొదలైంది కానీ.. ‘విశ్వంభర’ అప్‌డేట్ ఎక్కడ? ఫైర్ అవుతున్న చిరు ఫ్యాన్స్

కేవలం లోకల్ సమస్యలే కాకుండా, టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న పైరసీ అనే భూతంపై కూడా ఆయన గట్టిగా మాట్లాడారు. డిజిటల్ యుగంలో పైరసీ వల్ల కోట్ల రూపాయల వ్యాపారం నష్టపోతోందని, ఈ విపత్తును అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడాలని, అందుకు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ మద్దతును, సహకారాన్ని కూడా తాము త్వరలోనే కోరబోతున్నామని స్పష్టం చేశారు ధీరజ్ మొగిలినేని.చూడాలి మరి ధీరజ్ చేసిన ఈ కామెంట్స్ ఏ కాంట్రవర్సీలకి దారి తీస్తాయో !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×