Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఓజీ’ (OG Movie) వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం, అలాగే ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) దర్శకుడి నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా వారికి మంచి ఊపునిస్తోంది. ఇటీవల వదిలిన ‘దేఖ్‌లేంగే సాలా’ చార్ట్ బస్టర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెకండ్ సింగిల్‌ను మేకర్స్ వదలబోతున్నారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోని ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura Of Ustaad) పేరిట గురువారం మేకర్స్ వదిలారు. ఈ ప్రోమో ఎలా ఉందంటే..
Also Read- Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా నుంచి ఫహద్ ఔట్…రంగంలోకి మరోస్టార్ హీరో?
‘గబ్బర్ సింగ్’ తరహాలో రెడ్ టవల్‌ను చేతికి కట్టి పైకి చూపిస్తున్నట్లుగా ఈ వీడియో మొదలైంది. ఒక కుర్రాడు పరుగెడుతున్నట్లుగా చూపించారు. ఆ కుర్రాడి షర్ట్ వెనుక ‘గబ్బర్ సింగ్’ ఇమేజ్ ఉండటంతో పాటు, ఆ కుర్రాడి పార్ట్‌ను యానిమేషన్‌లో క్రియేట్ చేశారు. వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తన భుజాన గన్ పెట్టుకుని, మరో చేతిలో టేపు రికార్డర్ పట్టుకుని స్టైలిష్‌గా నడిచి వస్తున్నారు. వెనుక దేవిశ్రీ ప్రసాద్ తన డ్యూటీని ఓ రేంజ్‌లో చేస్తున్నారు. అవును, సాంగ్ ఎలా ఉండబోతుందనేది దేవిశ్రీ కంపోజ్ చేసిన ట్యూన్ తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ తన మ్యానిరిజమ్‌తో ఉన్న పోస్టర్ చూపిస్తూ.. అభిమానులంతా వైబ్ అవుతున్నట్లుగా చూపించారు. ఫైనల్‌గా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ను ఫిబ్రవరి 22న విడుదల చేయబోతున్నట్లుగా ఈ ప్రోమోలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
Also Read- Mrunal Thakur: స్టార్ హీరో వల్ల మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన మృణాల్ ఠాకూర్.. బయటపడిన నిజం..!
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 మార్చి 26న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మేకర్స్ కూడా అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కె జి ఎఫ్ అవినాష్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. మార్చి 26 కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Also Read- Vijay Rashmika: విజయ్ దేవరకొండ పెళ్లికి మీడియా నొ ఎంట్రీ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?