E-Paper
Advertisement

Sajjala khichdi: డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యాన్నిచ్చే సజ్జల కిచ్డీ, రెసిపీ ఇదిగో

Sajjala khichdi: డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యాన్నిచ్చే సజ్జల కిచ్డీ, రెసిపీ ఇదిగో
Advertisement

సజ్జలను పెర్ల్ మిల్లెట్‌ అంటారు. అలాగే బజ్రా అని కూడా పిలుస్తారు. సజ్జలతో పోషకాలతో నిండిన ఆహారం. వీటిని తినగానే శరీరానికి శక్తి ఇస్తుంది. జీర్ణక్రియకు ఎంతో మంచిది. ముఖ్యంగా చలికాలంలో సజ్జలతో చేసిన వంటలు శరీరానికి ఎంతో ఆరోగ్యమని పెద్దలు చెబుతారు. సజ్జలతో మసాలా కిచ్డీ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

సజ్జల కిచ్డీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
సజ్జలు – ఒకటిన్నర కప్పు
బంగాళదుంపలు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
టమోటా – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టీ స్పూన్
లవంగాలు – 2
బిరియాని ఆకులు – 2
కరివేపాకు – కొద్దిగా
ఇంగువ – చిటికెడు
పసుపు – ½ టీ స్పూన్
కారం పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత

Advertisement

Also read: Hill Station: మనదేశంలోనే అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్ ఇది, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

సజ్జల కిచ్డీ రెసిపీ
1. మొదట సజ్జలను బాగా కడిగి రెండు మూడు గంటలు నానబెట్టాలి. తరువాత ప్రెషర్ కుక్కర్‌లో సజ్జలు వేసి తగినంత నీరు పోసి 3,4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పక్కన పెట్టాలి.

Advertisement

2. బంగాళదుంపలను కడిగి కుక్కర్‌లో 2–3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నెయ్యి వేయాలి. నెయ్యి వేడిగా అయిన తరువాత ఇంగువ, జీలకర్ర, లవంగాలు, బిరియాని ఆకులు వేయాలి. ఇవి చిటపటలాడిన తరువాత కరివేపాకులు వేయాలి.

4. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టమోటా వేసి మెత్తబడే వరకు కలుపుతూ వేయించాలి.

5. టమోటా మెత్తబడిన తరువాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేయాలి.

6. ఇప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

7. ఇప్పుడు ముందుగా ఉడికించిన సజ్జలను కళాయిలో వేసి అన్ని పదార్థాలతో బాగా కలపాలి.

8. అవసరమైతే కొద్దిగా నీరు వేసి అయిదు నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత గ్యాస్ ఆఫ్ చేయాలి.

9. పైన కొద్దిగా నెయ్యి వేసి కలిపితే మరింత రుచిగా ఉంటుంది. అంతే కిచ్డీ రెడీ అయినట్టే.

10. వేడి వేడి సజ్జల మసాలా ఖిచ్డీని పెరుగు లేదా రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

Also read: Success Quotes: వారెన్ బఫెట్ చెప్పిన ఈ విషయాలు పాటిస్తే ధనవంతులవ్వడం ఖాయం

సజ్జల కిచ్డీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పక్కన అప్పడాలు లేదా ఊరగాయ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని వండి చూడండి. అద్భుతంగా ఉంటుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×