E-Paper
Advertisement

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !
Advertisement

Varun Tej:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబంలోకి తొలి వారసుడిగా అడుగుపెట్టి అందరి హృదయాలను దోచుకున్నారు. వాయువ్ తేజ్ (Vaayuv Tej).. వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతుల వారసుడిగా మెగా కుటుంబంలోకి ఈ చిన్నారి అడుగుపెట్టి అప్పుడే ఏడాది అయిపోయింది. ఈ సందర్భంగా తొలి పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ తో పాటు నిహారిక కొణిదెల పంచుకున్న స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మెగా వారసుడికి ఏడాది..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10 2025న బాబు జన్మించారు. ఈ బాబుకి వాయువ్ తేజ్ అని నామకరణం చేశారు. నేడు తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్, తన భార్య లావణ్య త్రిపాఠి తో కలసి తన కొడుకును ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోని షేర్ చేస్తూ..” మా చిన్నారి రాకుమారుడు వాయువ్ తేజ్ కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ALSO READ:ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

మేనల్లుడితో నిహారికాకు ప్రత్యేక అనుబంధం..

ఇకపోతే నిహారిక తన మేనల్లుడితో ఉన్న స్పెషల్ బాండింగ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “మా చిన్నారి రాకుమారుడు వాయువ్ తేజ్ కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ చుట్టూ ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం మరియు లెక్కలేనన్ని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మునుముందు నీ ప్రయాణం మరింత అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ నిహారిక షేర్ చేసింది. చిన్నారితో ఆప్యాయంగా ఆడుకుంటున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. అంతేకాదు తన మేనల్లుడితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ ఫోటోలు రూపంలో పంచుకుంది. ఏది ఏమైనా మేనల్లుడితో నిహారిక గడిపిన సమయం అత్యంత అద్భుతం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

వరుణ్ తేజ్ సినిమాలు..

Advertisement

వరుణ్ తేజ్ విషయానికొస్తే.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమౌతూ ఇబ్బంది పడుతున్న ఈయన అనూహ్యంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ నేపథ్యంలో హారర్ బ్యాక్ డ్రాప్ లో కొరియన్ కనకరాజు సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 60 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మరొకవైపు తన చెల్లెలు నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై బరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related News

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×