Bigg Boss 10: బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మరో కొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10). షో ప్రారంభమై మూడు రోజులు అయిపోయింది. నాలుగవ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని కూడా నిర్వాహకులు విడుదల చేశారు. ఇప్పటివరకు చూసిన ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ మధ్య నాయకత్వ పోరు, హౌస్ మేట్ గా నిలదొక్కుకోవాలనే తపన, ఒకరిపై ఒకరు ఫైర్ అవడం.. నిందించుకోవడం.. గొడవ పడడం అన్ని జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ ఆటను మొదలుపెట్టేస్తున్నారు. సింపథీ లేదంటూనే ఆడియన్స్ లో సింపథీ క్రియేట్ చేస్తూ సరికొత్త డ్రామా మొదలు పెట్టేశారు.. ఈ క్రమంలోనే నాల్గవ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో కామనర్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్ షాలిని పటేల్(Shalini Patel).. చైత్ర రాయ్ (Chaitra Rai ) పట్ల చూపించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విషయంలోకి వెళ్తే.. నాల్గవ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. “ఈ మహా పరీక్షలో మీలో ఇద్దరికీ హౌస్ మేట్ గా మారి.. నో రిస్క్ జోన్ లోకి వెళ్లే ఒక గొప్ప అవకాశాన్ని మీకు అందిస్తున్నాను.. కానీ మీ విజయం కోసం ఒకరిని హై రిస్క్ లోకి పంపించాల్సి ఉంటుంది అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఎవరినైతే మీరు డేంజర్ జోన్ లో పడేయాలి అనుకుంటున్నారో.. ఆ పేరును ఫ్రేమ్లో కరెక్ట్ గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది అంటూ టాస్క్ నిర్వహించారు.
అందులో భాగంగానే బ్లూ టీం తరఫున ఇద్దరు , రెడ్ టీం తరఫున ఇద్దరు పోటీపడ్డారు. బజర్ మోగగానే గేమ్ ఎండ్ అవుతుంది. ఇక ఫ్లాగ్స్ ఓపెన్ చేయండి అని చెప్పగానే బ్లూ టీం వాళ్ళు కృష్ణుడు పేరు మెన్షన్ చేయగా.. రెడ్ టీం వారు చైత్రారాయ్ టీం మెన్షన్ చేశారు. అయితే కృష్ణుడు అనే పేరును Krisnudu అని మిస్టేక్ పెట్టారు. కృష్ణుడు పేరు సరిగ్గా ప్లేస్ చేయలేనందువలన మీ ఛాలెంజ్ అసంపూర్తిగా ముగిసింది అంటూ త్రిగుణ్,ముఖేష్ గౌడలకు చెబుతాడు.
ఇటు రెడ్ టీం తరపున చైత్ర రాయ్ డేంజర్ జోన్ లో పడిపోయింది. అందరూ సీరియస్ మోడ్ లో ఉంటే.. ఇవేవీ పట్టించుకోకుండా షాలిని సాంగ్ ప్లీజ్ అంటూ డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఇక దీనితో అసలైన గొడవ మొదలైంది. సెలబ్రిటీ ఓడిపోయినందుకు కొంచెం కూడా వారికి బాధ లేదు అంటూ చైత్ర రాయ్ వద్ద ఆమె టీం డిస్కస్ మొదలు పెట్టగా.. షాలిని మాట్లాడుతూ.. సెలబ్రిటీ ఓడిపోయినందుకు నేను డాన్స్ చేశానని మీతో చెప్పానా అంటూ ఫైర్ అయ్యింది. కావాలని మీరు ఇదంతా బ్లేమ్ చేయాలనుకుంటే చేయండి.. అంటూ శాలిని ఫైర్ అయ్యింది. దీనికి చైత్ర రాయ్ మాట్లాడుతూ ..” నువ్వు నన్ను గెలకొద్దు. సింపథీ కోసం ఇదంతా చేస్తున్నావ్” అంటూ కామెంట్ చేసింది.
ALSO READ: ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!
దీనికి షాలిని మాట్లాడుతూ.. సింపథీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నాకున్న లైఫ్ స్టోరీ చాలు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో నువ్వే తప్పు చేశావు.. పైగా సింపథీ క్రియేట్ చేసుకోవట్లేదు అంటూనే మళ్లీ గుక్కపెట్టి ఏడుస్తూ.. ఆడియన్స్ లో సింపథీ క్రియేట్ చేసుకుంటున్నావు” అంటూ కొంతమంది నేటిజన్స్ షాలిని పై ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే షాలిని గట్టిగానే ప్లాన్ చేసింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.