E-Paper
Advertisement

అల్లు అర్జున్‌ను అలా చూసి షాక్ అయ్యా.. వడ్డే నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అల్లు అర్జున్‌ను అలా చూసి షాక్ అయ్యా.. వడ్డే నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

Allu Arjun Success: టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆయన నటిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘త్రిమూర్తులు’. తాజాగా ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వడ్డే నవీన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గత పదేళ్లలో టాలీవుడ్ హీరోల గ్లోబల్ సక్సెస్, బాక్సాఫీస్ రికార్డులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. “గత 10 ఏళ్ల కాలంలో టాలీవుడ్‌లో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన, ఇక్కడి నుంచి ఎక్కడికో ఎదిగారు అనిపించిన హీరో సక్సెస్ ఏది?” అని ప్రశ్నించారు. దానికి వడ్డే నవీన్ ఏమాత్రం తడుముకోకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పారు.

Read also-భారతీరాజా మృతికి కన్నీటిపర్యంతమైన నటులు ఆలీ, ముచ్చర్ల అరుణ.. 

అది పెద్ద సర్ప్రైజ్!

Advertisement

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం సాధించిన విజయం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వడ్డే నవీన్ పేర్కొన్నారు. “నిజానికి పుష్ప సినిమాను వాళ్ళు ఒక పక్కా తెలుగు సినిమాగా, రీజినల్ కంటెంట్‌తోనే ప్రారంభించారు. కానీ అది రిలీజ్ అయ్యాక నార్త్ బెల్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి బ్లాస్టింగ్ సక్సెస్ సాధించిందో మనమంతా చూశాం. పుష్ప సినిమా అంత పెద్ద రేంజ్‌కు వెళ్తుందని, వరల్డ్ స్టేజ్‌పై అంతగా గుర్తింపు తెచ్చుకుంటుందని బహుశా ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకే గత పదేళ్లలో అల్లు అర్జున్ సాధించిన ఈ గ్లోబల్ సక్సెస్ నాకు ఒక బెస్ట్ సర్ప్రైజ్” అని నవీన్ ప్రశంసల వర్షం కురిపించారు.

‘బాహుబలి’ విజయం..

ఇదే క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ సక్సెస్ గురించి కూడా వడ్డే నవీన్ మాట్లాడారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ సాధించిన విజువల్ వండర్ సక్సెస్ వెనుక ఉన్న కారణాలను ఆయన విశ్లేషించారు. “ప్రభాస్ విషయానికి వస్తే, ‘బాహుబలి’ సినిమాను రాజమౌళి ముందే ఒక లార్జ్ స్కేల్‌లో ప్లాన్ చేశారు. అది ఒక గ్లోబల్ సినిమా అనే మైండ్‌సెట్‌తోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. పైగా దర్శకుడు రాజమౌళి మేకింగ్ స్టైల్, ఆయనకున్న క్రేజ్ వల్ల ఆ సినిమా అంతటి ఘనవిజయం సాధిస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ముందే ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ సక్సెస్ అనేది ఊహించినదే” అని నవీన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Read also-దర్శకుడు భారతీరాజాకు నివాళులర్పించిన సినీ ప్రముఖులు.. సీఎం విజయ్ అయితే..

ఒకవైపు ముందే ఊహించిన భారీ క్రేజ్‌తో ప్రభాస్ పాన్-ఇండియా స్టార్‌గా నిలబడితే, మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రీజినల్ కంటెంట్‌తోనే ప్రపంచాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సక్సెస్ మాత్రం ఎప్పటికీ ఒక అద్భుతమని వడ్డే నవీన్ కొనియాడారు. ఏదేమైనా మన తెలుగు హీరోలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వడ్డే నవీన్ చేసిన ఈ కామెంట్స్ అటు మెగా అభిమానులను, ఇటు ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, వడ్డే నవీన్ ఒక అండర్ డాగ్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్న ‘త్రిమూర్తులు’ సినిమా సరికొత్త సస్పెన్స్ కాన్ఫ్లిక్ట్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×