E-Paper
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!
Advertisement

Real vs fake video identification: ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఒక సెలబ్రిటీ మాట్లాడాల్సిన మాటలను ఇంకొకరు మాట్లాడుతున్నట్టు, ఎవరో చేసిన పనిని మరొకరు చేసినట్టు భ్రమ కలిగించే వీడియోలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. దీని వెనక ఉన్న అసలు విలన్ ‘డీప్‌ఫేక్’ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పుట్టుకొచ్చిన ఈ కొత్త సైబర్ ముప్పు, నకిలీ ప్రపంచాన్ని సృష్టిస్తోంది. మరి, మన కళ్ల ముందే తిరుగుతున్న ఈ మాయా వీడియోల్లో నిజమేంటో, అబద్ధమేంటో కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఫేక్ వీడియోలను ఇలా పట్టుకోండి!
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా క్రైమ్స్ కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు ఫోటోలను మాత్రమే మార్చే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏకంగా మనుషుల హావభావాలు, గొంతు, నడక.. అన్నింటినీ మార్చేసి అచ్చం నిజమైన వీడియోలా క్రియేట్ చేస్తున్నారు. దీనినే డీప్‌ఫేక్ అంటారు. అయితే, ఏఐ ఎంత స్మార్ట్ అయినా.. చిన్న చిన్న లోపాలు వదిలేస్తుంది. వాటిని మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా పట్టుకోవచ్చు.

Advertisement

మీరు చూస్తున్న వీడియో నిజమైనదా, కాదా అని తెలుసుకోవడానికి ఈ 5 బెస్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.

1. కనురెప్పల కదలికలను గమనించండి
సాధారణంగా మనుషులు ప్రతి కొన్ని సెకన్లకు ఒకసారి కనురెప్పలు ఆరుస్తారు. కానీ, ఏఐ సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలలోని.. వ్యక్తులు చాలా సమయం వరకు కళ్ళు ఆర్పరు. ఒక వేళ ఆర్పినా అది చాలా అసాధారణంగా.. లేదా మెషిన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి.. వీడియోలో ఉన్న వ్యక్తి కళ్ళను క్షుణ్ణంగా పరిశీలించండి.

Advertisement

2. ముఖం, చర్మంలో తేడాలు
నిజమైన మనుషుల ముఖంపై ముడతలు, మచ్చలు, పోర్స్ (రంధ్రాలు) ఉంటాయి. కానీ డీప్‌ఫేక్ వీడియోలలోని ముఖాలు చాలా స్మూత్‌గా, ప్లాస్టిక్ బొమ్మల్లా మెరిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గడ్డం, మీసాలు ఉన్న వ్యక్తుల వీడియోలలో ముఖం పక్కకు తిరిగినప్పుడు జుట్టు కదలికలు బ్లర్ అవుతుంటాయి.

3. పెదవుల కదలికలు, ఆడియో సింక్
వీడియోలోని వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వారి పెదవుల కదలికలకు, వచ్చే వాయిస్‌కు ఏమాత్రం తేడా ఉన్నా అది ఫేక్ వీడియో అని డిసైడ్ అవ్వొచ్చు. ల్యాగ్ అవ్వడం, మాట పూర్తయినా పెదవులు కదలడం లేదా మాట రాకముందే పెదవులు కదలడం వంటివి ఏఐ వీడియోలలో సాధారణంగా జరిగే పొరపాట్లు.

4. లైటింగ్, షాడోస్
ఒక రూమ్ లో లేదా ఎండలో వీడియో తీసినప్పుడు కాంతి పడే దిశను బట్టి ముఖంపై నీడలు పడతాయి. కానీ డీప్‌ఫేక్స్ లో లైటింగ్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వదు. కళ్లలోని నల్లపాపపై పడే కాంతి కిరణాల ప్రతిబింబం కూడా ఒరిజినల్ వీడియోల్లో ఉన్నట్టు నేచురల్ గా ఉండదు.

5. రివర్స్ ఇమేజ్ సెర్చ్ అండ్ ఫ్యాక్ట్ చెక్ టూల్స్
మీకు ఏదైనా వీడియోపై అనుమానం వస్తే, ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకండి. ఆ వీడియో అసలు మూలాలు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. అలాగే ఇంటర్నెట్‌లో డీప్‌ఫేక్స్ గుర్తించడానికి ‘Deepware Scanner’ వంటి ఏఐ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను బ్లైండ్‌గా నమ్మేసి ఇతరులకు షేర్ చేయకండి. డిజిటల్ యుగంలో ‘చూసింది నమ్మే ముందు.. ఒక్క నిమిషం ఆలోచించడం’ అలవాటు చేసుకుంటేనే ఇలాంటి సైబర్ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోగలం.

 

Tags

Related News

శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనే ఆలోచన ఉందా? 2026లో టాప్ 5G ఫోన్ల లిస్ట్ ఇదే!

ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

9000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఇండియా వేరియంట్‌లో ఇదే హైలైట్?!

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

Big Stories

Advertisement
×