E-Paper
Advertisement

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!
Advertisement

El Niño Telangana: ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కనిపిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. గతంలో చూడని విధంగా ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంటున్నారని తెలిపారు. ఎన్నడూ లేని కరువు ఈసారి వచ్చే ప్రమాదం ఉందని, భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునేందుకు రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రైతులు ఆరు తడి పంటలు వేసేలా ప్రచారం చేయాలని అవగాహన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ప్రతి వారం ఎల్ నినో పై జిల్లా స్థాయిలో సమీక్ష చేస్తామన్నారు. మొదట ప్రాధాన్యత మంచి నీరు, సాగు నీరు పై దృష్టి పెడుతామని, రైతులు కూడా ఈ కరువు కాలంలో పంటల పై జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్ నినో పై ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా దీనికి ప్రజల సహకారం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి పౌరుడు ఈ కరువు సమయంలో సామాజిక బాధ్యతతో సహకరించాలని అన్నారు. రైతులు ఆరుతడి పంటకు వేయాలని కోరుతున్నామని, ప్రస్థుతం అన్ని ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని మంత్రి పొన్నం తెలిపారు.

Advertisement

Also read: నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

మంత్రి శ్రీధర్ బాబు..

ఈ కరువు దృష్ట్యా ప్రతి జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటామని మంత్రి తెలిపారు. ఎల్ నినో ఇలానే ఎక్కువ కాలం ఉంటే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవని అన్నారు. అందుకే సాగు నీటితో పాటుగా తాగు నీరు అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. కాళేశ్వరం విషయంలో భేషజాలు ఏమీ లేవు. మంచి సలహాలు ప్రతిపక్షాలు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 16 వేల క్యూసెక్‌లు మాత్రమే ఉందని, మొన్న వరద వచ్చిన సమాచారంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని తెలిపారు.

Advertisement

Also read: Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×