E-Paper
Advertisement

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?
Advertisement

Ramayana:భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రామాయణ అప్డేట్స్ అభిమానులలో ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నారని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ అటు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఆ విమర్శలను చిత్ర బృందం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే ఇప్పుడు విడుదల చేయబోయే ట్రైలర్లో ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత జాగ్రత్త తీసుకుంది చిత్రబృందం.

ఘనంగా ‘ప్రథమ్ సంకల్ప్’..

ముఖ్యంగా ఈసారి ట్రైలర్ లో ఎటువంటి లోపాలు లేకుండా.. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, గ్రాఫిక్స్ క్వాలిటీ ప్రేక్షకులకు ఒకసారి కొత్త అనుభూతిని ఇస్తున్నాయని, టీం పడిన కష్టం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే జూలై 18వ తేదీన రామాయణ చిత్ర నిర్మాణ సంస్థ’ ప్రథమ్ సంకల్ప్’ పేరిట ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ ఒక సరికొత్త సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన మూడు నిమిషాల నిడివి ఉన్న రామాయణ ట్రైలర్ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ.. విజువల్ వండర్ అనే ప్రశంసలు కూడా అందుకుంటోంది..

అబ్బుర పరుస్తున్న నటీనటుల పెర్ఫార్మన్స్..

Advertisement

ఇది చూసిన కొంతమంది సినీ విశ్లేషకులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్టార్ నటీనటుల లుక్స్ , స్క్రీన్ ప్రెజెంట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ లుక్ చాలా హుందాగా, దైవికత్వంతో కూడి ఉంది. సీతాదేవిగా దక్షిణాది స్టార్ నటి సాయి పల్లవి తన సహజమైన నటన పవిత్రమైన రూపంతో ఆ పాత్రకు నిండుదనాన్ని తీసుకొచ్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇందులో రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ స్క్రీన్ ప్రెజెంట్స్, ఆయన గాంభీర్యం ట్రైలర్ కే సరికొత్త హుందాధనాన్ని తీసుకొచ్చాయని చెబుతున్నారు. పైగా రావణుడి పాత్రలో ఆయనను చూడడం సరికొత్తగా గూస్ బంప్స్ తెప్పిస్తోందని కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక అలాగే రావణుడి సోదరి పాత్రలో శూర్పణఖగా రకుల్ ప్రీతిసింగ్ అలరించనుంది.

also read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

నా జీవితాంతం గుర్తుండిపోయే ప్రయాణం – సాయి పల్లవి

Advertisement

ఇకపోతే ఈ ఈవెంట్లో సాయి పల్లవి మాట్లాడుతూ.. “ఈ సినిమాలోని పాత్రలు భవిష్యత్తు తరాలకు పురాణ పాత్రలుగా గుర్తుండిపోతాయి. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు దర్శకుడికి, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప పాత్రలను పోషించడం అనేది ప్రతి నటీనటులకు ఒక పెద్ద సవాలు. ముఖ్యంగా సీతమ్మ పాత్ర పోషించడం నా అదృష్టం. నా పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలని నేను ప్రయత్నించాను. ఈ క్రమంలో ఎన్నో విషయాలు కూడా నేర్చుకున్నాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవంగా ఈ ప్రయాణం నిలిచిపోతుంది” అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

ట్రైలర్ రిలీజ్ కోసం అప్పటి వరకు ఎదురు చూడాల్సిందేనా?

ఇకపోతే రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది మొదటి భాగం దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే సినీ విశ్లేషకుల కోసం విడుదల చేసిన ఈ ట్రైలర్ కి పాజిటివ్ రివ్యూ ఇస్తుంటే.. సామాన్య ప్రేక్షకులు, అభిమానులలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇకపోతే అధికారిక ట్రైలర్ గ్లోబల్ డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఈనెల 24 వరకు ఎదురు చూడాల్సిందే అంటూ అధికారికంగా చిత్ర బృందం స్పష్టం చేసింది.మరి విజువల్ వండర్ అంటూ సినీ విశ్లేషకుల చేత ప్రశంసలు అందుకుంటున్న ఈ ట్రైలర్ విడుదలయ్యాక ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×