E-Paper
Advertisement

ఆనంద్ దేవరకొండతో పెళ్లి.. ఓపెన్ గా చెప్పేసిన వైష్ణవి చైతన్య!

ఆనంద్ దేవరకొండతో పెళ్లి.. ఓపెన్ గా చెప్పేసిన వైష్ణవి చైతన్య!
Advertisement

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఏకంగా సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను అందుకున్నారు. బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. తదుపరి పలు సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదని చెప్పాలి. ఇకపోతే త్వరలోనే ఈమె నటించిన ఎపిక్(Epic) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దేవర కొండ ఫ్యామిలీ కోడలిగా..

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉండగా వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) జంటగా వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. వైష్ణవి చైతన్య దేవరకొండ ఫ్యామిలీ కోడలుగా అడుగుపెట్టబోతున్నారని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఆనంద్ దేవరకొండతో పెళ్లి..

Advertisement

ఈ వార్తలకు అనుగుణంగానే తాజాగా వైష్ణవి చైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాపిడ్ ఫైర్ సెషన్ లో ఈమె ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ముగ్గురు హీరోల పేర్లను చెప్పింది. సిద్దు జొన్నలగడ్డ, విరాజ్, ఆనంద్ దేవరకొండ. ఈ ముగ్గురిలో పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు? ఎవరికి బ్రేకప్ చెబుతారు? ఎవరిని లవ్ చేస్తారు అంటూ ప్రశ్న వేశారు.

ఆనంద్ దేవరకొండ ప్రేమలో వైష్ణవి చైతన్య..

ఈ ప్రశ్నకు వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ విరాజ్ కు బ్రేకప్ చెప్పేస్తానని, సిద్దు జొన్నలగడ్డను లవ్ చేస్తానని తెలిపారు. ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని ఈమె చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. వైష్ణవి చైతన్య సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టిన నిజంగానే ఇది తన మనసులో మాటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవి చైతన్య ఈ కామెంట్స్ తో అభిమానులు కూడా ఈమె దేవరకొండ ఫ్యామిలీ చిన్న కోడలుగా రాబోతుందంటూ గట్టిగా ఫిక్స్ అయ్యారని చెప్పాలి. మరి నిజంగానే ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య ప్రేమలో ఉన్నారా? దేవరకొండ ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా వైష్ణవి చైతన్య అడుగుపెట్టబోతున్నారా ? అనేది తెలియాలి అంటే ఈ విషయంపై వీరు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

Also Read: మంచు ఫ్యామిలిలో పుట్టకపోతే బాగుండు..ఇలా అనేసావేంటీ లక్ష్మక్క ?

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×