E-Paper
Advertisement

Vaibhav Suryavanshi : విధ్వంస‌క‌ర బ్యాట్స్ మెన్.. విజ‌య్ హాజారే ట్రోఫీ నుంచి ఔట్..!

Vaibhav Suryavanshi : విధ్వంస‌క‌ర బ్యాట్స్ మెన్.. విజ‌య్ హాజారే ట్రోఫీ నుంచి ఔట్..!
Advertisement

Vaibhav Suryavanshi : టీమిండియా అండ‌ర్-19 ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి దాదాపు అంద‌రికీ తెలిసిందే. అత‌ను ఆడే ఇన్నింగ్స్ ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయితే తాజాగా అత‌ను వార్త‌ల్లో నిలిచాడు. విజ‌య్ హాజారే ట్రోఫీ 2025-26 యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 24న బీహార్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన ఈ బుడ‌త‌డు.. అరుణాచల్ ప్ర‌దేశ్ పై 84 బంతుల్లో190 ప‌రుగులు చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. అయితే అత‌ని ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 15 సిక్స్ లు ఉండ‌టం విశేషం. లిస్ట్ – ఏ క్రికెట్ లో సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డుల్లో నిలిచాడు.

Also Read : INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య మూడో టీ20.. సిరీస్ ప‌ట్టేయాల‌ని..!

విజ‌య్ హాజారే ట్రోఫీ నుంచి వైభ‌వ్ సూర్య‌వంశీ ఔట్

Advertisement

ముఖ్యంగా 14 ఏళ్ల 272 రోజుల వ‌య‌స్సులో సెంచ‌రీ చేశాడు వైభ‌వ్. విజ‌య్ హాజారే ట్రోఫీలో ప్లేట్ గ్రూపులో బీహార్ జ‌ట్టు మ్యాచ్ కి వైభ‌వ్ దూరం కానున్న‌ట్టు స‌మాచారం. డిసెంబ‌ర్ 26న ఢిల్లీలో జ‌రిగే అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో వైభ‌వ్ సూర్య‌వంశీ పాల్గొన‌నున్నాడు. ప్ర‌ధాన మంత్రి జాతీయ బాల‌ల అవార్డుకు వైభ‌వ్ కి ఎంపిక‌య్యాడు. ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వం న్యూఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రుగుతుంది. ఇందుకోసం వైభ‌వ్ బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లాడు. ప్ర‌ధాన‌మంత్రి జాతీయ బాల‌ల అవార్డు ప్ర‌దానోత్స‌వంలో అధ్య‌క్షురాలు ద్రౌప‌ది ముర్ము పిల్ల‌లను స‌త్క‌రిస్తారు. ఆ త‌రువాత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పిల్ల‌లంద‌రితో స‌మావేశ‌మ‌వుతారు. అవార్డుల ప్ర‌దానోత్స‌వం త‌రువాత వైభ‌వ్ సూర్య‌వంశీ భార‌త అండ‌ర్ – 19 జ‌ట్టులో చేర‌నున్నాడు. డిసెంబ‌ర్ 30న సౌతాఫ్రికా కి భార‌త జ‌ట్టు బ‌య‌లు దేరుతుంది.

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వైభ‌వ్ సూర్యవంశీ

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైభ‌వ్ మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరిస్ లో ఆడ‌నున్నాడు. సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్ జ‌న‌వ‌రి 04న ప్రారంభం కానుంది. చివ‌రి మ్యాచ్ జ‌న‌వ‌రి 09న జ‌రుగ‌నుంది. ఆ త‌రువాత భార‌త అండ‌ర్ – 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నుంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ న‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక‌వ్వ‌డం ఖాయం. అనంత‌రం అత‌ను ఐపీఎల్ 2026 లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. సౌతాఫ్రికా సిరీస్, అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్, ఐపీఎల్ 2026 రాణిస్తే.. వైభ‌వ్ క‌చ్చితంగా బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ దృష్టిలో ఉంటాడు. మ‌రోవైపు ఈ ఏడాది ఐపీఎల్ లోఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాడో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఇండియ‌న్ క్రికెట‌ర్ నెల‌కొల్ప‌ని రికార్డు ను అతిపిన్న వ‌య‌స్సు లోనే వైభ‌వ్ సూర్య‌వంశీ క్రియేట్ చేయ‌డం విశేషం. అత‌ను క్రీజులో ఉంటే.. ప‌రుగులు వ‌ర‌ద‌లా పారేల్సిందేన‌ని అదే అత‌ని ఫార్ములా. ఇక‌ ఆ త‌రువాత అదే ఫామ్ కొన‌సాగితే.. టీమిండియాలో చోటు సంపాదించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Advertisement

Also Read : Boxing Day : క్రికెట్ హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ డే.. ఒకే రోజు 29 మ్యాచ్‌లు..!

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×