E-Paper
Advertisement

Saraswati Movie: ‘సరస్వతి’ ఫస్ట్ లుక్ చూశారా!.. లేడీ విలన్ దర్శకురాలు ఇరగదీసిందిగా..

Saraswati Movie: ‘సరస్వతి’ ఫస్ట్ లుక్ చూశారా!.. లేడీ విలన్ దర్శకురాలు ఇరగదీసిందిగా..
Advertisement

Saraswati Movie: వరలక్ష్మి శరత్‌కుమార్ కేవలం నటిగానే కాకుండా, ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఎరుపు రంగు చీర ధరించి, ధైర్యంగా నడుస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ క్రాక్ టెక్స్చర్, దాని వెనుక బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో కనిపిస్తున్న ఇతర పాత్రల సిల్హౌట్స్ కథలోని లోతును, ఇంటెన్సిటీని సూచిస్తున్నాయి. ఈ విజువల్ ఎలిమెంట్స్ చూస్తుంటే ఇదొక హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌ అని స్పష్టమవుతోంది.

Read also-Sree Vishnu: ‘మృత్యుంజయ్’, ‘విష్ణు విన్యాసం’ రిలీజ్‌లో స్మాల్ ఛేంజ్!.. అది ఏంటంటే?

నిర్మాణం

Advertisement

ఈ చిత్రాన్ని వరలక్ష్మి తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ‘దోస డైరీస్‌’ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. నటనలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వరలక్ష్మి, ఈ సినిమాతో దర్శకురాలిగా ఏ మేరకు మెప్పిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టైటిల్ పోస్టర్ నుండి నేటి ఫస్ట్ లుక్ వరకు ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచుతూనే ఉంది. ‘సరస్వతి’ చిత్రంలో దక్షిణాదికి చెందిన దిగ్గజ నటులు భాగస్వామ్యం కావడం విశేషం. జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధికా శరత్‌కుమార్ వంటి ఉద్ధండులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు కిషోర్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి, మైమ్ గోపి, రఘు బాబు, తులసి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. ఇంతమంది నైపుణ్యం ఉన్న నటులు ఉండటం సినిమాలోని కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.

Read also-Marathi films on ott : ఓటీటీలో ఉన్న మతిపోగొట్టే మరాఠీ సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

సాంకేతిక నిపుణులు

Advertisement

ఈ చిత్రానికి టాప్ క్లాస్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఎ.ఎం. ఎడ్విన్ సకే సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వెంకట్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుధీర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంది. చిత్ర బృందం త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ లోని కొత్త కోణాన్ని చూపే ఈ ‘సరస్వతి’ థ్రిల్లర్ జోనర్‌లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×