E-Paper
Advertisement

SSMB 29 Title: ఇట్స్ అఫీసియల్.. మహేష్ బాబు – రాజమౌళి మూవీ టైటిల్ ఇదే

SSMB 29 Title: ఇట్స్ అఫీసియల్.. మహేష్ బాబు – రాజమౌళి మూవీ టైటిల్ ఇదే
Advertisement

SSMB 29 Title: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ స్ రాజమౌళి (S.A Rajamouli)దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించిన వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబుకు సంబంధించిన పోస్టులకు పోస్టర్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు. ఈ సినిమాకు రాజమౌళి “వారణాసి”(Varanasi)అనే టైటిల్ ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. చివరికి ఈ వార్తలను నిజం చేస్తూ రాజమౌళి వారణాసి అనే టైటిల్ ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్..

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది అభిమానులు పాల్గొని సందడి చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. సైలెంట్ గా రాజమౌళి షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు కానీ నేడు ఏకంగా గ్రాండ్ గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతోపాటు ఇతర సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టైటిల్ తో పాటు మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే సినిమా నుంచి ఒక వీడియోని కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఈయన కుంభ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

రుద్ర పాత్రలో మహేష్?

Advertisement

ఇక హీరోయిన్ పాత్రలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించబోతున్నారని ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇలా వీరిద్దరి పోస్టర్లను విడుదల చేసిన చిత్ర బృందం నేడు గ్లోబ్ ట్రాటర్ వేడుకలో మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో మహేష్ బాబు కూడా రుద్ర పాత్రలో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Rana Daggubati: సీఐడీ విచారణకు వచ్చి కాంత ప్రమోషన్స్…రానా రూటే సపరేటు!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×