E-Paper
Advertisement

Maa Oori Polimera 2:పొలిమేర 2 షూటింగ్ టైంలో 5గురు మృతి… అసలేం జరిగిందంటే ?

Maa Oori Polimera 2:పొలిమేర 2 షూటింగ్ టైంలో 5గురు మృతి… అసలేం జరిగిందంటే ?
Advertisement

Maa Oori Polimera 2: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా హర్రర్ జోనర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా సినిమాలను విభిన్న రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలోనే ఇలా కామెడీ హర్రర్ జానెర్ లో తెరకెక్కిన 12A రైల్వే కాలనీ(12A Railway Colony) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.  పొలిమేర, పొలిమేర 2 (Maa Oori Polimera 2) సినిమాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్(Anil Vishwanth) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమా నవంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

పొలిమేర 2 షూటింగ్.. 5 మంది మరణం..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనిల్ విశ్వనాధ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పొలిమేర 2 సినిమా గురించి సంచలనమైన విషయాలను బయటపెట్టారు. ఈ సినిమా చేతబడి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా అనిల్ విశ్వనాథ్  వెల్లడించారు. తాము పొలిమేర 2 సినిమాని దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు షూటింగ్ చేసాము అయితే ఈ జర్నీలో మా సినిమాకు సంబంధించిన ఐదుగురు మరణించారని తెలిపారు.

భయపడి హోమం చేసిన నిర్మాత..

Advertisement

ఇలా మా పొలిమేర 2 సినిమాకు సంబంధించిన మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ వంటి వాళ్లు ఐదు మంది చనిపోవడంతో మా నిర్మాత పూర్తిగా భయపడిపోయారని, ఏకంగా హోమం కూడా చేయించారని అనిల్ తెలిపారు. అయితే ఈ సినిమా చేతబడి నేపథ్యంలో తెరకెక్కుతున్న కారణంగానే చనిపోయారనుకొని భయపడి ఇలా చేయించారని తెలిపారు. నిజానికి చనిపోయిన ఐదుగురు నెలల వ్యవధిలో చనిపోలేదని, ఏడాదిన్నర కాలంలో కరోనా రావడం యాక్సిడెంట్ వంటి కారణాలవల్ల చనిపోయారని తెలిపారు. ఇకపోతే ఇటీవల కాంతార సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర ఆర్టిస్టులు వరుసగా చనిపోతున్న నేపథ్యంలో అందరూ భయాందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

హర్రర్ సినిమాతో అల్లరి నరేష్..

Advertisement

ఇక పొలిమేర 2 కూడా చేతబడి నేపథ్యంలో తెరకెక్కడంతో నిర్మాత భయపడ్డారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పొలిమేర చిత్ర బృందమే తాజాగా అల్లరి నరేష్(Allari Naresh) కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarala) హీరో హీరోయిన్లుగా 12 A రైల్వే కాలనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా కూడా హర్రర్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టమవుతుంది. మరి నవంబర్ 21వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: SSMB 29 Title: ఇట్స్ అఫీసియల్.. మహేష్ బాబు – రాజమౌళి మూవీ టైటిల్ ఇదే

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×