E-Paper
Advertisement

Viral Video: రన్నింగ్ ఆటో మీద దూకి, అమ్మాయిని కాపాడిన హిందూ హీరో!

Viral Video: రన్నింగ్ ఆటో మీద దూకి, అమ్మాయిని కాపాడిన హిందూ హీరో!
Advertisement

ఓ ఆటో వేగంగా దూసుకెళ్తుంది. లోపల ఓ అమ్మాయి తనను కాపాడాలంటూ కేకలు వేస్తుంది. ఓ యువకుడు ఆటో వెనుక నుంచి పటుకుని ఉన్నాడు. ఆ అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. లోపలి నుంచి ఇద్దరు యువకులు అతడి మీద కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. ఆటో వెనుక ప్రమాదకరంగా వేలాడుతూ అలాగే వెళ్లాడు. మరికొంత మంది మోటార్ సైకిల్ మీద ఆ ఆటోను వెంబడించి, కత్తులు పట్టుకుని దాడి చేసే వారి నుంచి ఓ అమ్మాయి రక్షించారు. ఇదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో సారాంశం. ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగిందని ప్రచారం చేస్తున్నారు.

భయం పెడుతున్న వీడియో

నిజానికి ఈ వీడియో చూడ్డానికి షాకింగ్ గా ఉంది. ఆటో ఎక్కడ పడిపోతుందో అని ఊపిరి బిగపట్టుకుని చూశారు. హిందూ హీరో అంటూ సదరు యువకుడిని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు, ఓ వర్గం మీద అనుచిత వ్యాఖ్యల దాడి మొదలయ్యింది. చూసేందుకు భయంకరమైన వీడియో.. దానికి మతం రంగు పులమడంతో బాగా వైరల్ అయ్యింది. విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ వీడియో వెనుక కథ ఏంటి?

Advertisement

ఇదీ అసలు సంగతి!

ఇక ఈ వీడియోను చూసి చాలా మంది సదరు హిందూ యువకుడు అద్భుతమైన ధైర్య సాహసాలు పదర్శించాడంటూ కొనియాడారు. కానీ. చివరకు తేలింది ఏంటంటే.. అదో షార్ట్ ఫిల్మ్ కోసం చిత్రీకరించిన వీడియో. సోషల్ మీడియాలో వ్యూస్ పొందేందుకు, సబ్‌స్క్రైబర్లను  ఆకట్టుకునేందుకు ఈ వీడియోను చిత్రీకరించినట్లు గుర్తించారు. అమ్మాయిని కిడ్నాప్ చేయడం, ఆమెను కాపాడేందుకు హిందూ యువకుడు సినిమా రేంజ్ స్టంట్ చేయడం అంతా అవాస్తవం అని తేలిపోయింది.  ఈ విజువల్స్ లో కనిపించిన వారంతా ఆర్టిస్టులేనని నెటిజన్లు అభిప్రాయానికి వచ్చారు. ఆటోను పట్టుకున్న వ్యక్తి, అతడి మీద దాడి చేస్తున్న వ్యక్తులు అంతా స్క్రిప్ట్ లో భాగంగా యాక్ట్ చేసినట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదంతా జస్ట్ యాక్టింగ్.. నో రియాలిటీ అంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొంత మంది ప్రయత్నించారంటున్నారు.  మొత్తంగా ఇదో కట్టుకథగా తేల్చేశారు.

నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

Advertisement

మరికొంత మంది నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి వారి వల్ల కొన్ని మతాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి వీడియోలను షేర్ చేసే సమయంలో అందులో వాస్తవం ఏంటని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తప్పుడు సమాచారం కారణంగా సమాజం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Read Also:  నా భార్యకు నా కంటే కుక్కలే ఇష్టం.. విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×