E-Paper
Advertisement

Varun Sandesh : అయ్యప్పమాలలో హీరో వరుణ్ సందేశ్… పాట పడాడు.. గూస్ బంప్స్ అంతే

Varun Sandesh : అయ్యప్పమాలలో హీరో వరుణ్ సందేశ్… పాట పడాడు.. గూస్ బంప్స్ అంతే
Advertisement

Varun Sandesh : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. హ్యాపీ డేస్ లాంటి ఫీల్ గుడ్ మూవీలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేశాడు. ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా బిగ్గెస్ట్ హిట్ ను అందించలేదు.. గత కొన్నేళ్లుగా సినిమాలకి గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్య సినిమాల కోసం కథలను వింటున్నాడు. సినిమాల సంగతి పక్కనపెడితే.. వరుణ్ సందేశ్ ఈమధ్య దైవదర్శనానికి ఎక్కువగా వెళుతున్నాడన్న విషయం తెలిసిందే. భార్యతో కలిసి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం అయ్యప్ప మాలను ధరించారు. ప్రస్తుతం స్వామీ పూజలో నిమగ్నమాయ్యాడు. తాజాగా ఆయన అయ్యప్ప పూజలో భాగంగా పాట పాడారు. ఆ పూజ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయ్యప్ప పై పాట పాడిన వరుణ్ సందేశ్..

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు హీరోలు శబరిమల అయ్యప్పమాలను ధరిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప మాలను వేసుకున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా అయ్యప్ప స్వామి మాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా చాలా మంది హీరోలు ఈ దీక్షను స్వీకరించి అయ్యప్ప దీక్ష పూనుకున్న తర్వాత ఎంతో నిష్టగా పూజలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ అయ్యప్ప పూజలు చేస్తూ, భజనలు చేస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతున్నాడు..ఈ క్రమంలో ఇటీవల ఆయన చేసిన అయ్యప్ప భజన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో హరీర సుతనే అంటూ స్వామివారి పై పాట పాడారు. ఆయన పాటకు అక్కడ వారిలో గుస్ బంప్స్ వచ్చాయని వీడియోకు ట్యాగ్ చేశారు.. ఆ పాట, భజన వీడియోపై అయ్యప్ప భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

Advertisement

Also Read :30 శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న బన్నీ… అంతా ఐబొమ్మ రవి పుణ్యమేనా??

వరుణ్ సందేశ్ పడి పూజ ఫోటోలు.. 

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం అయ్యప్ప మాల వేసుకున్న విషయం తెలిసిందే. తన దీక్షకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.. అయితే తాజాగా అయ్యప్ప స్వామి పడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తన భార్య వితికా కూడా పాల్గొంది. అయ్యప్ప పడి పూజకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నాడు వరుణ్ సందేశ్. ఈ పూజ ని విజయవంతంగా పూర్తి చేసిన స్వాములు అందరికీ ధన్యవాదాలు తెలిపారు వరుణ్ సందేశ్. ఈ పూజకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇకపోతే వరుణ్ సందేశ్ సినిమాల విషయానికొస్తే… కొన్నేళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు.

Advertisement

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×