E-Paper
Advertisement

VD 14 film: రౌడీ హీరో సినిమాకు పవర్ ఫుల్ టైటిల్… ఫాన్స్ ఆకలి తీర్చబోతున్న డైరెక్టర్?

VD 14 film: రౌడీ హీరో సినిమాకు పవర్ ఫుల్ టైటిల్… ఫాన్స్ ఆకలి తీర్చబోతున్న డైరెక్టర్?
Advertisement

VD 14 film: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేని నేపథ్యంలో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గీతగోవిందం లాంటి సినిమాల తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ మాత్రం ఇప్పటివరకు అందుకోలేకపోతున్నారు. ఈయన విభిన్నమైన కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ప్రేక్షకాదరణ మాత్రం నోచుకోలేకపోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ చివరిగా కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈయన రెండు సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఫ్యాన్స్ ఆకలి తీర్చనున్న డైరెక్టర్..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ (rahul Sankrityan)దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా VD14 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటి రష్మిక మందన్న నటించబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావటం విశేషం. ఇకపోతే జనవరి 26వ తేదీ ఈ సినిమా టైటిల్ , గ్లింప్స్ కి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

రణబలి..

Advertisement

ఈ సినిమాకు రణబలి(Ranabali) అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సమాచారం.బ్రిటీష్ పాలన కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని, 1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా ఈ సినిమా టైటిల్ అలాగే ఇదివరకు విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా విజయ్ దేవరకొండ అభిమానుల ఆకలి తీరుస్తానంటూ ఇటీవల డైరెక్టర్ చేసిన మాటను నిలబెట్టుకోబోతున్నారని తెలుస్తోంది.

రష్మిక విజయ్ కు స్పెషల్ మూవీ..

Advertisement

మరి ఈ సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం రణబలి అని పెట్టబోతున్నారా ?లేదా? అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు మాత్రమే వేచి ఉండాలి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా హీరోయిన్ గా నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గీతాగవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ వెండితెరపై జంటగా కనిపించబోతున్నారు. ఈ సినిమా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా స్పెషల్ గా ఉండబోతుందని చెప్పాలి.

Also Read: Allu Arjun -Sandeep Reddy: అల్లు ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్..సందీప్ రెడ్డితో బన్నీ మూవీ ఫిక్స్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×