E-Paper
Advertisement

Allu Arjun -Sandeep Reddy: అల్లు ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్..సందీప్ రెడ్డితో బన్నీ మూవీ ఫిక్స్

Allu Arjun -Sandeep Reddy: అల్లు ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్..సందీప్ రెడ్డితో బన్నీ మూవీ ఫిక్స్
Advertisement

Allu Arjun -Sandeep Reddy: పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.

అట్లీ సినిమా పనులలో బిజీగా బన్నీ..

అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా అల్లు అర్జున్ కు 22వ సినిమా కావటం విశేషం. అయితే తన 23వ సినిమాని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్నట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాపై గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్ లో కూడా సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతూ టి సిరీస్ బ్యానర్ అధినేత భూషణ్ కుమార్(Bhushan kumar) క్లారిటీ ఇచ్చారు.

సందీప్ రెడ్డితో అల్లు అర్జున్ సినిమా..

Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సందీప్ రెడ్డి వంగ లైనప్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు .ఈ సినిమా అనంతరం రణబీర్ కపూర్ యానిమల్ సీక్వెల్ సినిమా ఉండబోతుందని, ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉండబోతోంది అంటూ భూషణ్ కుమార్ క్లారిటీ ఇవ్వడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సందీప్ రెడ్డి అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా అల్లు అర్జున్ 25వ సినిమా అని తెలుస్తోంది.

పుష్ప 3 తర్వాతనే సందీప్ రెడ్డి సినిమా ..

Advertisement

లోకేష్ కనగరాజుతో ఈయన చేయబోయే సినిమా 23వ సినిమా కావటం విశేషం అయితే తన 24వ సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప3 చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరమే సందీప్ రెడ్డితో సినిమా ఉంటుందని స్పష్టమవుతుంది. సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ పనులను పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన అనంతరమే బన్నీతో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే .ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. 2027 మార్చి 25వ తేదీ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు సందీప్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: Hrithik Roshan: చేతి కర్రల సాయంతో స్టార్ హీరో… టెన్షన్ లో ఫాన్స్..ఏం జరిగిందంటూ?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×