E-Paper
Advertisement

‘హరుడు’ సినిమాలో గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్న నటి వేద్విక సోని..

‘హరుడు’ సినిమాలో గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్న నటి వేద్విక సోని..
Advertisement

Vedvika Soni: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ, దూసుకుపోతున్న యువ నటి వేద్విక సోని ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అహ్మదాబాద్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ, మోడలింగ్ రంగంలో రాణిస్తూ నటిగా స్థిరపడాలనే బలమైన ఆకాంక్షతో దక్షిణ భారత వినోద రంగంలోకి అడుగుపెట్టింది. మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధమాకా’ ద్వారా మెయిన్ స్ట్రీమ్ టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేద్విక, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా తెలుగు సినిమాలు, క్రేజీ ఓటీటీ ప్రాజెక్టులు, పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్ కలాబరేషన్ల ద్వారా నటిగా తన పరిధిని విస్తరించుకుంటూ, గ్లామర్‌తో పాటు నటనలోనూ తన ప్రతిభను చాటుకుంటోంది.

Read also-‘కింగ్’ నాగార్జున సినీ ప్రస్థానానికి నలభై ఏళ్లు.. తండ్రి బాటలో హృదయాలను గెలుచుకుంటూ..

Advertisement

వేద్విక సోని సినీ కెరీర్‌లో డిజిటల్ స్థాయిలో మంచి మైలేజ్ ఇచ్చిన ప్రాజెక్టుల్లో ‘మథుర’ ఒకటి. ఈ చిత్రంలో ఆమె కనబరిచిన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌, చక్కటి నటన ప్రేక్షకులను కట్టిపడేశాయి, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌కు ఆమెను మరింత చేరువ చేశాయి. అదే ఉత్సాహంతో ఇటీవల విడుదలైన ‘హరుడు’ సినిమా ద్వారా వేద్విక మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె సుమారు 35 నుంచి 40 నిమిషాల పాటు కనిపించే కీలక పాత్ర పోషించింది. సినిమాలో పలువురు హీరోయిన్లు ఉన్నప్పటికీ, వేద్విక తన ఎక్స్‌ప్రెసివ్ యాక్టింగ్‌, ఎలిగెంట్ లుక్‌, కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.

Read also-Illu Illaalu pillalu prema : భర్తతో నాలుగేళ్ల ప్రయాణం.. ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ వైరల్..

Advertisement

వెండితెరపైనే కాకుండా, వేద్విక సోని సోషల్ మీడియా వేదికగా కూడా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో లైఫ్‌స్టైల్ కంటెంట్, ఫ్యాషన్‌, ట్రావెల్‌, బ్యూటీ‌, ఫిట్‌నెస్‌ డైరీస్‌తో పాటు, తన షూటింగ్‌ల వెనుక జరిగే ఆసక్తికర విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ డిజిటల్ వరల్డ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. వైవిధ్యమైన ప్రాజెక్టులను ఎంచుకుంటూ, గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటన కనబరచగల సత్తా ఉన్న ఈ అహ్మదాబాద్ బ్యూటీ, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగేందుకు బలమైన పునాదులు వేసుకుంటోంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×