
Niharika Konidela ( Source / Instagram )
టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మెగా వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేసింది. ఒక్క సినిమా కూడా ఆమెకు హీరోయిన్గా మంచి సక్సెస్ ని ఇవ్వలేదు.

Niharika Konidela ( Source / Instagram )
బుల్లితెరపై యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తన అందం, చలాకితనం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెడితే సూపర్ హిట్ సినిమాలు అకౌంట్లో పడతాయని అందరూ అనుకున్నారు. అలా జరగలేదు..

Niharika Konidela ( Source / Instagram )
ఒక మనసు మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహా రెడ్డి చిత్రాలలో నటించారు.. తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి జనాలను ఆకట్టుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.. అయితే ఎక్కువ కాలం భర్తతో ఉండలేదు. మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది.

Niharika Konidela ( Source / Instagram )
ఇటీవల పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా మారింది. ఈ బ్యానర్లో ఇప్పటికే సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మించబడ్డాయి. రీసెంట్ గా సంగీత శోభన్ హీరోగా నటించిన రాకాస మూవీ ఈమె బ్యానర్ లోనే వచ్చింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

Niharika Konidela ( Source / Instagram )
సినిమాల సంగతి పక్కన పెడితే నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ వస్తుంది.

Niharika Konidela ( Source / Instagram )
తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆమె అందం ఆ డ్రెస్ కే కాస్త అందాన్ని పెంచింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..