E-Paper
Advertisement

విధ్వంసాలు వాళ్లు చేసి.. నిందలు మాపై నెడతారా? వైసీపీపై బొండా ఉమా ఆగ్రహం!

విధ్వంసాలు వాళ్లు చేసి.. నిందలు మాపై నెడతారా? వైసీపీపై బొండా ఉమా ఆగ్రహం!
Advertisement

Bonda Uma: వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పక్కనబెట్టి, అరాచక పాలన సాగించారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగకుండా అడ్డుకోవడమే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని గుర్తుచేశారు.

నామినేషన్ల అడ్డుకోత.. విధ్వంసకర రాజకీయాలు

Advertisement

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన క్షణం నుంచే ప్రత్యర్థి అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వైసీపీకి అలవాటుగా మారిందని ఉమా విమర్శించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేయడం లాంటి అకృత్యాలకు పాల్పడ్డారన్నారు. పుంగనూరుతో పాటు అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులే స్వయంగా విధ్వంసాలు సృష్టించి, ఆ నెపాన్ని నెట్టుకురావడానికి టీడీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బెదిరింపులతో ఏకగ్రీవాలు.. ప్రాణాపాయ దాడులు

Advertisement

2021 స్థానిక సమరంలో హత్యా రాజకీయాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను భ్రష్టు పట్టించారని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. భయాందోళనలు సృష్టించి అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. గతంలో మాచర్లలో తనపై జరిగిన హత్యాయత్నం సంఘటనను గుర్తుచేస్తూ, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల దీవెనల వల్లే తాను ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగానని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను మళ్లీ ప్రభావితం చేయాలని వైఎస్సార్సీపీ చూస్తోందని, వారి కుట్రలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ బార్ కౌన్సిల్‌కు బిగ్ షాక్.. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై BCI స్టే!

Tags

Related News

చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్ఐ నెట్టేయడంతో కిందపడ్డ విడదల రజిని!

2028లో నాయకులను చెప్పులతో కొడతారు..జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

స్థానిక సమరం.. సీట్ల కలవరం.. వరుసగా రెండో రోజు చంద్రబాబు, పవన్ భేటి

‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’.. చంద్రబాబు, ఎస్ఈసీ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

జోగి రమేష్ కోడలికి రోడ్డు ప్రమాదం.. ఘటనపై అనుమానాలు.. పోలీసులకు మేఘన తండ్రి ఫిర్యాదు!

పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు!

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

Big Stories

Advertisement
×