E-Paper
Advertisement

యంగ్ డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తున్న వెంకీ మామ.. కథల వేటలో అస్సలు తగ్గట్లేదుగా!

యంగ్ డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తున్న వెంకీ మామ.. కథల వేటలో అస్సలు తగ్గట్లేదుగా!
Advertisement

Venkatesh Projects: మన వెంకీ మామా స్పీడ్ పెంచినట్టే కనిపిస్తున్నాడు.అవును..సంక్రాంతి బరిలో వచ్చిన సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకి ఫుల్ లెంత్ సినిమా చేసింది లేదు.మన శంకర వరప్రసాద్ గారు లో తళుక్కుమని మెరిసినా అది కాస్తా చిరు ఖాతాలోకి వెళ్ళిందే.

అయితే ఆగ్యాప్ ని ఒక్కసారిగా పూడ్చేస్తూ రాబోయే రోజుల్లో వరుస ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వెంకీ మామ సాలిడ్ ప్లానింగ్ తో ముందుకు రాబోతున్నాడని వినిపిస్తుంది.

Advertisement

షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ‘ఆదర్శ కుటుంబం’

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఇంకా మొదలుకాలేదు కానీ, హీరోయిన్ నుంచి మిగతా క్యాస్టింగ్ దాకా అన్నీ లీకులతోనే ఆడియన్స్ తెలుసుకుంటున్న పరిస్థితి.ఇక వాలకం చూస్తుంటే ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Advertisement

ఇంకోవైపు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పుడెప్పుడు వెంకటేష్ వచ్చి సెట్స్ లో అడుగు పెడతారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 2027 సంక్రాంతి రేసులో తన సినిమాను దించాలన్న పట్టుదలతో ఉన్నాడట అనిల్.ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది. అయితే తక్కువ సమయంలోనే క్వాలిటీగా అవుట్ పుట్ తీయడం అనిల్ రావిపూడికి కొత్తేమి కాదు.

గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్స్ ఇచ్చిన ఈ కాంబోలో ఈసారి నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తోడవ్వడంతో ఇద్దరు హీరోల మల్టీస్టారర్ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. అటు నందమూరి అభిమానుల్లోనూ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసి జనవరి పండగ బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్న వశిష్ట  

ఈ రెండు సెట్స్ పై ఉండగానే వెంకటేష్ తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట పట్ల నిర్మాత సురేష్ బాబు సానుకూలంగా ఉన్నారట. వశిష్ట చెప్పిన ఒక క్రేజీ లైన్ నచ్చడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుల్ నెరేషన్ మరియు స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ జానర్ ఏంటనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ టచ్ ఉన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. బింబిసార, విశ్వంభర సినిమాల తర్వాత వశిష్ట ఈసారి ఫాంటసీ జోలికి పోకుండా ప్యూర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్.

అంటే ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ లో, అనిల్ రావిపూడి – వెంకీ కాంబో మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజైతే కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే రెండు భారీ సినిమాలు ఫ్యాన్స్ కి ఇచ్చిన ఘనత వెంకటేష్ కి దక్కుతుంది. ఒకవేళ వశిష్ఠ స్టోరీ కూడా త్వరగా ఓకే చేయించుకుని వేగంగా షూటింగ్ కంప్లీట్ చేయగలిగితే, ఆ సినిమా కూడా వచ్చే ఏడాది దసరాకో లేదా దీపావళికో థియేటర్లలోకి వచ్చేయొచ్చు.

కథల ఎంపికలో ఏ మాత్రం రాజీ లేదంటున్న వెంకీ 

ఇవి కాకుండా పలువురు యంగ్ డైరెక్టర్స్ కూడా వెంకటేష్ ని కలిసి కథలు వినిపిస్తున్నారు కానీ ఆయనను మెప్పించలేకపోతున్నారని వినిపిస్తుంది. టాలీవుడ్ లోని ఒక స్టార్ బ్లాక్ బస్టర్ రచయిత చెప్పిన స్టోరీ సైతం వెంకీ రిజెక్షన్ లిస్ట్ లో పెట్టేశాడట. కథల ఎంపికలో ఏ మాత్రం రాజీ పడకుండా, అభిమానులకు మాంచి ఎంటర్ టైనర్స్ అందించడమే లక్ష్యంగా వెంకటేష్ స్పీడ్ పెంచడం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also read :మెగా కోడలి సర్‌ప్రైజ్: ‘అత్తమ్మాస్ కిచెన్’ రుచులకు ఫిదా అయిన త్రిష.. పిక్ వైరల్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×