E-Paper
Advertisement

మెగా కోడలి సర్‌ప్రైజ్: ‘అత్తమ్మాస్ కిచెన్’ రుచులకు ఫిదా అయిన త్రిష.. పిక్ వైరల్!

మెగా కోడలి సర్‌ప్రైజ్: ‘అత్తమ్మాస్ కిచెన్’ రుచులకు ఫిదా అయిన త్రిష.. పిక్ వైరల్!
Advertisement

Trisha Gift: త్రిష కృష్ణన్.. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరిది.ఒకవైపు వరుస ప్రాజెక్టులతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా దూసుకుపోతూ,మరో వైపు తమిళ దళపతి సీయం విజయ్ సన్నిహితురాలిగా వార్తల్లో తెగ హైలెట్ అవుతున్న ఈ చెన్నై చంద్రం తాజాగా ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ అందుకుంది.అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి.

విషయంలోకి వెళ్తే రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ అందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, కొణిదెల కోడలు ఉపాసన కామినేని కొణిదెల నుంచి త్రిష ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్‌ను అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి ధర్మపత్ని సురేఖ కొణిదెల ఆద్వర్యంలో  హోమ్ మేడ్ ఫుడ్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి ఈ స్పెషల్ సర్‌ప్రైజ్ త్రిష వద్దకి చేరింది.

Advertisement

ఉపాసనకు  కృతజ్ఞతలు తెలిపిన  త్రిష 

ఈ సమ్మర్ స్పెషల్ గిఫ్ట్ బాక్స్‌ను చూసి మురిసిపోయిన త్రిష, తక్షణమే ఆ ఫొటోలను తన అఫీషియల్ అకౌంట్ లో షేర్ చేస్తూ  ఉపాసనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. టేస్టీ ఆవకాయ పచ్చళ్లతో పాటు నోరూరించే రకరకాల సాంప్రదాయ పొడులు ఈ హ్యాంపర్‌లో ఉండటంతో మెగా ఫ్యామిలీ రుచులకు ఫిదా అయిపోయింది ఈ తమిళ చిన్నది.

Advertisement

ప్రస్తుతం మార్కెట్‌లో ‘అత్తమ్మాస్ కిచెన్’ బ్రాండ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. చిరంజీవి ఇంట్లో సురేఖమ్మ స్వయంగా తయారుచేసే వంటకాల రుచిని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఉపాసన ఈ స్టార్టప్‌ను బిజినెస్ వరల్డ్ లోకి తీసుకొచ్చారు. ఇందులో లభించే కేసరి, పొంగల్, ఉప్మా, రసంతో పాటు వీరు అందించే పులిహోర మిక్స్ ఆన్‌లైన్‌లో విపరీతంగా అమ్ముడవుతోంది కూడా. తాజాగా త్రిషకు పంపిన ఈ టేస్టీ గిఫ్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవి సరసన

ఇదిలా ఉంటే, త్రిషకు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె 2006లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘స్టాలిన్’లో స్క్రీన్ షేర్ చేసుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష నటిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏడు ఆగస్ట్ లో రిలీజ్ అవుతుందని వినిపిస్తుంది.అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాలి.

ఇక కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, త్రిష పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజూ హైలెట్ అవుతూనే ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి సీఎం పీఠం అయిన ఈ సమయంలో , విజయ్-త్రిషల కాంబినేషన్‌పై కోలీవుడ్ మీడియాలో రకరకాల గాసిప్స్ సర్క్యులేట్ అవుతున్నాయ్. వీరిద్దరూ కలిసి చివరగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. గతంలో ‘గిల్లి’, ‘కురువి’, ‘తిరుపాచి’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చిన ఈ జోడీపై రూమర్స్ రావడం కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్య కాలంలో త్రిష పెళ్లి చేసుకోబోతోందనే ప్రచారం మరింత పీక్స్ కు చేరింది.

ఈ దోబూచులాటలు ఇంకెంత కాలం కొనసాగిస్తుందో

ఈ గాసిప్స్ అన్నింటికీ త్రిష తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెడుతోంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై నేరుగా స్పందించకుండా, రీసెంట్‌గా ఆమె పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన పెంపుడు కుక్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ‘నా వ్యక్తిగత విషయాల్లోకి ప్రవేశించడానికి కేవలం నా కుక్కకు మాత్రమే అనుమతి ఉంది’ అంటూ రూమర్ రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్ట్ ద్వారా తనకు ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు లేవని, తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని పరోక్షంగా స్పష్టం చేసింది. చూడాలి మరి ఈ అమ్మడు ఈ దోబూచులాటలు ఇంకెంత కాలం కొనసాగిస్తుందో

Also read :షారూఖ్, కోహ్లీల క్లబ్‌లోకి కేజీఎఫ్ హీరో.. కోట్లు కుమ్మరించి యష్ దంపతుల లగ్జరీ ఇన్వెస్ట్ మెంట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×