E-Paper
Advertisement

పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల బదిలీల్లో అక్రమాలు.. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు

పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల బదిలీల్లో అక్రమాలు.. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు
Advertisement

Engineer Transfers: స్వేచ్చ బ్యూరో: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాకలోని కీలకమైన పబ్లిక్ హెల్త్ విభాగంలో ఇంజనీర్ల బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు జారీ చేసిన జీవోలకు విరుద్దంగా ఈ బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగినట్లు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిక్ హెల్త్ విభాగంలోని ఓ కీలక అధికారి పబ్లిక్ హెల్త్ విభాగంలోని ఇతర అధికారులతో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను తప్పుదోపట్టిస్తూ ఈ బదిలీలు చేపట్టినట్లు కూడా చర్చ లేకపోలేదు. ఈ శాఖలో పర్యవేక్షణ, పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే ఒక చోట కేటాయించిన పోస్టింగ్ లో విధులు నిర్వర్తించేందుకు ససేమిరా అన్నందుకు సస్పెన్షన్ కు గురైన ఇంజనీర్ కు కూడా ఈ బదిలీల్లో చోట్టు కల్పించటం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఇష్టారాజ్యంగా వ్యవహరం..

సస్పెన్షన్ లో ఉన్న విషయాన్ని సదరు అధికారులు దాచి పెట్టి, కొత్తగా ఇచ్చిన పోస్టింగ్ లో రిపోర్టు చేసేందుకు వెళ్లగా, మీరు సస్పెన్షల్ లో ఉన్నారు కదా? అని చీఫ్ ఇంజనీర్ ప్రశ్నించే వరకు ఈ విషయం బయట పడలేదంటే పబ్లిక్ హెల్త్ విభాగంలో అంతర్గతంగా ఇంకా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అంచనా వేయవచ్చు. చీఫ్ ఇంజనీర్ ప్రశ్నకు దిమ్మదిగిరిన సదరు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ తాను లీవ్ లో ఉన్నానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయటంతో మొత్తం ట్రాన్స్ ఫర్లు నిబంధనలకు విరుద్దంగా, ఇష్టారాజ్యంగా జరిగిన విషయం బయట పడింది. అయినా ప్రభుత్వం వద్ద అన్ని దాచిపెట్టి బదిలీల జాబితాలో సదరు సస్పెన్షన్ కు గురైన అధికారి పేరుండటాన్ని ఉన్నతాధికారులు కూడా తప్పుబట్టినట్లు తెలిసింది. ఇప్పటికే పబ్లిక్ హెల్త్ విభాగంలో కొందరు ఇంజనీర్లు ఒకే చోట లాంగ్ స్టాండింగ్ గా, అంటే అయిదారేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారిని వదిలేసి, ఏకంగా సస్పెన్షల్ లో ఉన్న ఇంజనీర్ కు బదిలీ చేయటం అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది.

ఇంజనీర్ల సీరియల్ ప్రకారం..

Advertisement

బదిలీల కోసం ఇంజనీర్లకు ఆప్షన్లు ఇచ్చినా, వాటిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండానే బదిలీలు చేశారన్న వాదనలు సైతం ఉన్నాయి. లాంగ్ స్టాండింగ్ లిస్టులో ఉన్న ఇంజనీర్ల సీరియల్ ప్రకారం చేయాల్సిన ఈ బదిలీలను పబ్లిక్ హెల్త్ లో ఓ కీలకమైన అధికారి తనకు లబ్ది చేకూర్చేలా బదిలీలు చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లాంగ్ స్టాండింగ్‌లో ఉండి అదే స్థానంలో ఆప్షన్ ఇస్తే, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దన నిబంధన ఉన్నా, కొందరు ఇంజనీర్ల బదిలీల విషయంలో ఈ నిబంధనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండానే అడిగిన చోటే పోస్టింగ్‌లు ఇచ్చారని, ఈ వ్యవహారంలో భాగంగా చేతులు మారినట్లు కూడా వాదనలున్నాయి. కానీ సూపరింటెండెంట్ ఇంజనీర్ల బదిలీ విషయానికొస్తే జాబితాలో నలుగురు ఎస్ఈలను చూపించినప్పటికీ, వారిలో ఏ ఒక్కరిని ఉన్న చోట నుంచి ఇతర చోటుకు బదిలీ చేయకపోవటం గమనార్హం.

Also Read: అశ్వారావుపేటలో కోట్ల విలువైన సర్కారు భూమి మాయం.. ప్రైవేట్ వ్యక్తులకు 15 ఎకరాలు అమ్మేసిన శ్రీమంతుడు!

బదిలీ చేయటం ఏమిటీ..?

Advertisement

పైగా లాంగ్ స్టాండింగ్ లిస్టులో లేని ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్‌ను కరీంనగర్ నుండి వరంగల్ కు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయటం ఏమిటీ? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రధాన కార్యాలయంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో విధులు నిర్వర్తించే అధికారులు జిల్లాలకు హెడ్‌లుగా హెడ్స్‌గా వ్యవహరిస్తూ, వారికి అనుకూలంగా, వారికి చేతులు తడిపిన ఇంజనీర్లను తమ ఇష్టారాజ్యంగా బదిలీలు చేసినట్లు కూడా వాదనలున్నాయి. ఈ రకంగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఇంజనీర్లను గత 2024లో చేపట్టిన బదిలీల్లో, ప్రస్తుతం చేపట్టిన ట్రాన్స్ ఫర్లలోనూ వారికి బదిలీలను మినహాయించారన్న చర్చ లేకపోలేదు.

ఒక అధికారి కొనసాగింపుకు ముగ్గురు మంత్రుల సిఫార్సులు

ఎపుడు ఇంజనీర్ల బదిలీలు జరిగినా, చక్రం తిప్పే పబ్లిక్ హెల్త్ ఆఫీసులోని నాలుగు, అయిదో అంతస్తులో విధులు నిర్వర్తించే ఇద్దరు ఇంజనీర్లకు పలువురు మంత్రుల అండదండలున్నట్లు కూడా చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు ఇంజనీరింగ్ అధికారుల్లో ఒకర్ని ప్రస్తుతమున్న స్థానంలోనే కొనసాగించాలని ఏకంగా ముగ్గురు మంత్రుల నుండి సిఫార్సు లెటర్లు వచ్చినట్లు కూడా పబ్లిక్ హెల్త్ విభాగంలోని సిబ్బంది, అధికారుల గుసగుసలు. సదరు ఇద్దరు ఇంజనీర్లు చెప్పిన వారికే ఈఈ, డీఈ, ఏఈ ల ట్రాన్స్ఫర్ లలో మార్పులు చేసినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడ్డా సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పరిధిలో నివాసముంటే కొందరు ఇంజనీర్లు తమ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే పోస్టింగ్‌లు చేజిక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి.

Also Read: రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

గత నెల 25వ తేదీన..

2025 డిసెంబర్ లో సర్కారు జారీ చేసిన జీవోలో ఒకే స్టేషన్ లో నాలుగేళ్లు మంచి కొనసాగుతున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పేర్కొన్నా, కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లలోకి బదిలీ అయిన వారిని తాజాగా చేపట్టిన బదిలీల నుంచి మినహాయించటం పై చాలా మంది ఇంజనీర్లు ప్రశ్నించగా, ఆ జాబితాలోని ఇంజనీర్లను గత నెల 25వ తేదీన మళ్లీ కౌన్సిలింగ్ కు పిలవటం హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు లాంగ్ స్టాండింగ్ లిస్టులో ఉన్న చాలా మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల కు ఈ బదిలీలను ఎందుకు వర్తింపజేయలేదని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. లాంగ్ స్టాండింగ్ గా కొనసాగుతున్న ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల జామితాలో మొత్తం 15 మంది ఉండగా, వారిలో కేవలం ఐదు మందికి ఈ బదిలీలను మినహాయించటం ఏమిటన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

రికమండేషన్ లెటర్లు..

పైగా లాంగ్ స్టాండింగ్ జాబితాలో లేని డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ లను ట్రాన్స్ ఫర్ చేయటం గమనార్హం. పలువురుు మంత్రులు ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారని కొందర్ని, ఎవ్వరి నుండి రికమండేషన్ లెటర్లు తెచ్చుకోలేదని మరికొందరిని, వారు ట్రాన్స్ ఫర్ లిస్టులో లేకపోయినా, వారికెలాంటి ఆప్షన్లు ఇవ్వకుండా బదిలీలు చేశారని కొందరు బాధిత ఇంజనీర్లు వాపోతున్నారు. పైగా ట్రాన్స్ ఫర్స్ లిస్టు ఆన్ లైన్ లో పెట్టాలన్న నిబంధన ఉన్నా, ఆ నిబంధనను తుంగలో తొక్కిన ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇష్టారాజ్యంగా బదిలీల దందా చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. మళ్లీ ప్రాంతీయ బేస్‌లో పొలిటికల్ వార్..?

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×