E-Paper
Advertisement

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకీ పాత్ర లీక్.. అనిల్ ప్లానింగ్ అదుర్స్ ?

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకీ పాత్ర లీక్.. అనిల్ ప్లానింగ్ అదుర్స్ ?
Advertisement

MSVPG Film: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) నయనతార (Nayanatara)ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం మన శంకరా వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు వెంకటేష్ (Venkatesh) కూడా కీలక పాత్రలో నటించారు. వెంకటేష్ పాత్ర సుమారు 25 నిమిషాల పాటు ఉండబోతుందని అనిల్ రావిపూడి తెలియజేశారు.

వెంకటేష్ పాత్ర లీక్..

వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని సినిమాని మరో లెవల్ కు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మాస్ సాంగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పటికే విడుదల కాగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే విషయంపై వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నయనతారకు అప్పటికే పెళ్లి కాగా రెండో పెళ్లి చేసే సన్నివేశం ఉంటుందని ఇలా రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చే అబ్బాయి పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారని సమాచారం.

మంచి స్నేహితులుగా చిరు, వెంకీ..

Advertisement

ఇక నయనతారను కలవకముందే చిరంజీవి వెంకటేష్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి తెలియని నయనతార పాత్రతో చిరు, వెంకీ నడిపే డ్రామా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇలా వెంకటేష్ పాత్ర 25 నిమిషాల పాటు ఉన్నప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారని తెలుస్తోంది. ఇలా మొదటి సారి చిరంజీవి వెంకటేష్ కలిసి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్..

Advertisement

చాలా రోజుల తర్వాత చిరంజీవి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి చివరిగా భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారి పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఏవి ఇప్పటివరకు నిరాశపరచలేదు. ఇటీవల ఈయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర వరప్రసాద్ గారు కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారిలో మరో హీరో .. ఒక్క వీడియోతో భారీ హైప్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×