E-Paper
Advertisement

Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారిలో మరో హీరో .. ఒక్క వీడియోతో భారీ హైప్!

Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారిలో మరో హీరో .. ఒక్క వీడియోతో భారీ హైప్!
Advertisement

Nari Nari Naduma Murari: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల జాబితాలలో శర్వానంద్(Sharwanand) నటించిన నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari ) సినిమా కూడా ఒకటి. ఇన్ని రోజులు ప్రమోషన్లకు కాస్త దూరంగా ఉన్న చిత్ర బృందం ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేయడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. శర్వానంద్, సంయుక్తం మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 15వ తేదీ ప్రసారం కాగా జనవరి 14వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

శర్వానంద్ సినిమాలో శ్రీ విష్ణు..

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేయగా ఈ వీడియో ద్వారా మరొక నటుడు శ్రీ విష్ణు(Sree Vishnu) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశారు. ఈ వీడియోని విడుదల చేస్తూ ప్రత్యేక ప్రకటన, నవ్వుల పండుగకు సిద్ధంగా ఉండండి అంటూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది .ఇలా ఈ సినిమాలో శ్రీ విష్ణు కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలియడంతో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాకు అబ్బరాజు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ..

Advertisement

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందని తెలుస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ రిలీజ్ అంటూ పలువురు భావిస్తున్నారు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ గతంలో శతమానం భవతి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా స్టార్ హీరోలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ప్రభాస్ ,చిరంజీవి, రవితేజ, వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇలా తెలుగు హీరోలతో పాటు కోలీవుడ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో స్టార్ హీరోలు పోటీకి దిగినప్పటికీ శర్వానంద్ వెనకడుగు వేయకుండా తన సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు . ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టత్మకంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ గతంలో మాదిరి తన మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారా? లేదా మరోసారి నిరాశ ఎదుర్కొంటారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Big tv kissik talks: జీవితాంతం జనసేనకే నా మద్దతు..అస్సలు తగ్గను..ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది!

Related News

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big Stories

Advertisement
×