E-Paper
Advertisement

Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి టార్గెట్.. వెనుక స్కెచ్ అదే!

Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి టార్గెట్.. వెనుక స్కెచ్ అదే!
Advertisement

Peddireddy Ramachandra Reddy: జిల్లాల పునర్విభజనలో కూటమి ప్రభుత్వం వ్యూహంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మూడు జిల్లాలలో పాగా వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒకే జిల్లాకే పరిమితం చేసేలా.. మిగతా జిల్లాల్లో అయన ప్రాతినిధ్యాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడమే కాకుండా .. భవిష్యత్తులో రాజకీయంగా ఆయన పట్టు తగ్గించేలా కూటమి ప్రభుత్వ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే టాక్ నడుస్తుందట. పునర్విభజన సందర్భంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో మార్పులుచేర్పులు చూస్తుంటే ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది.

పునర్విభజనపై మంత్రుల సబ్ కమిటిని ఏర్పాటు

Advertisement

ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో కూటమి ఘన విజయం తర్వాత జిల్లాల పునర్విభజనపై మంత్రుల సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్‌ను చిత్తూరు అన్నమయ్య జిల్లాలో ఉంచారు. అయితే రాజంపేట లోక్‌సభ పరిధిలోని పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో ఉంచారు. మిగతా అరు నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసారు.. ఆ క్రమంలో మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలని గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి.

భూ సేకరణ పేరుతో పెద్ద ఎత్తున భూ దందా

Advertisement

రాయలసీమలో ఉన్న పురాతన పట్టణాలలో మదనపల్లి ఒకటి.. రైల్వే, జాతీయ రహాదారులు ఉన్న ప్రాంతం. బెంగుళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు కావల్సిన ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. మరో వైపు రాజంపేట కూడా రాయచోటి కంటే పెద్దది. వీటన్నింటిని కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంతో రాజంపేట వాసులు కూడా ఉద్యమాల బాట పట్టారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోలేదు. సరికదా రాయచోటిలో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు పేదలభూముల పై డేగ కన్ను కూడా పడింది .ప్రభుత్వ కార్యాలయాల కోసం భూ సేకరణ పేరుతో పెద్ద ఎత్తున భూ దందా నడించిందనే అరోపణలు కూడా అప్పటి వైసీపీ నేతలపై వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మదనపల్లి కు జిల్లా హామీ ఇచ్చారు. మరో వైపు రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా చేస్తానని కూడా హామీ ఇచ్చారు.

ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలు, ఆక్రమణల ఆరోపణల

2024 ఎన్నికల్లో తన నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాధికారం చేపట్టడంతో చంద్రబాబు తనను దెబ్బ తీయడానికి కృషి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై గతంలో కన్నా భిన్నంగా దృష్టి సారించారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుందట. ఓవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలు, ఆక్రమణల ఆరోపణలపై విచారణ జరుగుతుండగానే.. మరోవైపు రామచంద్రారెడ్డి రాజకీయ మూలాల్లో ఆయన ప్రభావాన్ని తగ్గించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ నడుస్తుందట. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా పరిధి నుంచి అన్నమయ్య జిల్లా పరిధిలో మార్చడం. వరుస ఎన్నికల్లో రాజంపేట లోక సభ నియోజకవర్గం 3సార్లు విజయం సాధిస్తూ వచ్చిన రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధిక్యతను తగ్గించడంపై కూటమి ప్రభుత్వం ద‌ృష్టి పెట్టిందంట.

మదనపల్లె జిల్లా కేంద్రం హామీని చంద్రబాబు అమలు చేశారంట.

2014, 2019, 2024 వరుస ఎన్నికల్లో గెలిచిన మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్య కేంద్రంగా మార్చేశారు. రెండు మూడేళ్ళ క్రితం ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్ సభ స్థానంతో పాటు 2024 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. రాజంపేట ఎంపీ, పుంగనూరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలుగా పెద్దిరెడ్డి ఫ్యామిలీనే గెలిచింది. గత ఎన్నికల్లో ఆ జిల్లాలోని రాయచోటి లో తెలుగుదేశం పార్టీ గెలిచినా పెద్ద మెజారిటీ కూడా లభించలేదు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన మదనపల్లె జిల్లా కేంద్రం హామీని చంద్రబాబు అమలు చేశారంట.

రాయచోటిని సమగ్ర అభివృద్ధి కేంద్రంగా రూపు దిద్దుతామని చంద్రబాబు హామీ

అందులో భాగంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోన్న అన్నమయ్య జిల్లా ను మూడు నియోజకవర్గాలకు పరిమితం చేశారు. తరువాత దశలో ఆ మూడు నియోజకవర్గాల్లో రాజంపే‌టను వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లా పరిధిలోకి, రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లా పరిధిలోకి మార్చివేసి , అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లె కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన రాయచోటిని సమగ్ర అభివృద్ధి కేంద్రంగా రూపు దిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇతర అంశాల సంగతెలా ఉన్న ఈ మార్పు చేర్పులు పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించడానికి దారితీయనున్నాయంటున్నారు.

జిల్లాల భౌగోళిక స్వరూపాల మార్పులతో కొత్త రాజకీయ నాయకత్వాలు

ఇటు చిత్తూరు జిల్లాకు పుంగనూరు దూరం కావడంతో చిత్తూరు జిల్లా పై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం తగ్గుతుందనేది స్థానికంగా నడుస్తున్న చర్చ. అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మూడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధులకు మారిపోతున్నాయి. జిల్లాల భౌగోళిక స్వరూపాల మార్పులతో కొత్త రాజకీయ నాయకత్వాలు, వర్గబలాలు ఏర్పాటు కానున్నాయనేది పొలిటికల్ టాక్. ఒక విధంగా ఈ పరిణామాలన్నీ పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ఆధిక్యతను దెబ్బతీయడానికి దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయని నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి.

రైల్వేకోడూరులో కొంత కాలంగా ఇన్చార్జి వ్యవహారంపై విమర్శలు

సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టడానికి కూడా చంద్రబాబు అన్నమయ్య జిల్లా విభజనకు అడుగులు వేశారా అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ. ఇప్పటికే రాయచోటికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన సుగవాసి ప్రసాద్‌ను రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించారు. అదే విధంగా రాజంపేటను కడపలో కలపడంతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రాజును ఇన్చార్జిగా నియమించారు. మరో వైపు రైల్వేకోడూరులో కొంత కాలంగా అక్కడ ఇన్చార్జి వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో మూడు నియోజకవర్గాలను మూడు జిల్లాలలో కలపడం ద్వారా పట్టు పెంచుకోనే విధంగా టీడీపీ అధినేత పావులు కదిపారంట.

తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు రాయచోటి షెల్టర్ జోన్

మొత్తం మీద ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు వ్యవహారం నడిచిందంటున్నారు. మరో వైపు ఇంటలిజెన్స్ సలహా మేరకు రాయచోటి నుంచి జిల్లా కేంద్రం పూర్తిగా తరలించినట్లు సమాచారం. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిచిన్న విషయానికి మతాల గొడవలతో ఇరు వర్గాలు రోడ్ల మీదకు రావడమే కాకుండా పోలీసులపై దాడికి సైతం దిగుతున్నారు. ఓ సామాజిక వర్గం ఓట్ల కోసం నాయకులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు రాయచోటి షెల్టర్ జోన్ అయంది. ఇలాంటి వాటితో భవిష్యత్తు ఇబ్బంది కరంగా మారే అవకాశముందనే జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించమని ఇంటలిజెన్స్ వర్గాలు సిఫార్సు చేశాయంట.

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×