E-Paper
Advertisement

Adilabad: ఆదిలాబాద్‌.. హస్తం పార్టీలో అలజడి కారణం ఇదేనా?

Adilabad: ఆదిలాబాద్‌.. హస్తం పార్టీలో అలజడి కారణం ఇదేనా?
Advertisement

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదవుల పంపకాల పంచాయతీలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రాంతానికే పదవులను కట్టబెడుతుందని..మరో ప్రాంతం వారు గుర్రుగా ఉన్నారట. అనుకున్న పదవి రాలేదని ఓ ఎమ్మెల్యే అలక భూనితే.. సీఎంకు ముఖ్య అనుచరుడైనా..పదవి యోగం లేకపోవడంతో ఓ ఎమ్మెల్యేకు నిరాశ కలిగిస్తుందట. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటి..? ఆ ఎమ్మెల్యే ఎవరు..?

ఆదిలాబాద్‌ జిల్లా హస్తం పార్టీలో అలజడి

ఆదివాసీల జిల్లా ఆదిలాబాద్‌ జిల్లాలో హస్తం పార్టీలో మళ్లీ అలజడి రేగుతోంది. పదవుల కోసం ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. అధిష్టానం వివక్ష చూపిస్తోందంటూ..కొందరు ఎమ్మెల్యేలు.. పార్టీ పెద్దలపై కారాలు మిరియాలు నూరుతున్నారట. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో..తమకు మంత్రి పదవులు, ప్రభుత్వంలో ఉన్నత పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని టాక్.

తూర్పు, పశ్చిమలో పదవుల పంపకాలపై తేడా

Advertisement

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పదవుల పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయని బొజ్జు..గరం గరం అవుతున్నారట. కాంగ్రెస్ పెద్దలు ..అదిలాబాద్ తూర్పు జిల్లాపై ప్రేమ కురిపిస్తూ.. పశ్చిమ జిల్లాను అసలు పట్టించుకోవడంలేదని అభిప్రాయాలు అక్కడి కాంగ్రెస్‌ వర్గాల్లోనూ నెలకొన్నట్లు సమాచారం. తూర్పు జిల్లాలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకే అవకాశాలు ఇస్తున్నారని.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పశ్చిమ జిల్లాను పూర్తిగా విస్మరిస్తున్నారని హస్తం శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతున్నాయట.

తూర్పు ప్రాంతంలో మూడు స్థానాలు కైవసం

2023 ఎన్నిల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తూర్పు ప్రాంతంలో మూడు ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ..చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ప్రేమ్‌ సాగర్‌రావు అధిష్టానంపై అలకభూనారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలే వచ్చిన ఆయన్ను భుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావుకు సివిల్ సప్లై శాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చి చల్లబరిచారు. అయినా కూడా తను అనుకున్న పదవి రాకపోవడంతో..ప్రేమ్ సాగర్‌రావు అధిష్టానంపై ఇంకా అసంతృప్తితోనే ఉన్నారట.

డీసీసీ అధ్యక్షుడిగా బొజ్జు పటేల్ నియామకం

Advertisement

ఇక పశ్చిమ జిల్లా నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. ఆదివాసి కోటాలో తన పేరు పరిశీలించాలని ఇప్పటికే తన మనసులో మాటను అధిష్టానం ముందు ఉంచారంట. దీనికి తోడు బొజ్జు పటేల్‌కు సీఎం సన్నిహితుడనే పేరుంది. దీంతో రెండో దశ విస్తరణలో ఖచ్చితంగా బొజ్జు పటేల్‌ పేరుంటుందని ..పశ్చిమ జిల్లా కార్యకర్తలు తెగ ఆశపడ్డారట. అయితే జిల్లా నుంచి వివేక్‌ వెంకటస్వామి పేరు ప్రకటించడంతో…ఒక్కసారిగా బొజ్జు పటేల్, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అయితే మంత్రి పదవి దక్కకపోయినా కనీసం ప్రభుత్వ విప్ పదవి వస్తుందని బొజ్జు పటేల్ ఆశించారట. కానీ బొజ్జు పటేల్‌కు షాకిస్తూ…అధిష్టానం ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.

కాంగ్రెస్ పెద్దలపై బొజ్జు పటేల్ తీవ్ర అసంతృప్తి

మంత్రి పదవి వస్తుందనుకుంటే రాలేదు..పోనీ..విప్‌ అయినా చేస్తారని ఆశిస్తే..అదీ దక్కలేదు. చివరకు డీసీసీతో సరిపెట్టడంతో…ఎమ్మెల్యే బొజ్జు పటేల్..ఆయన అనుచరులు..కాంగ్రెస్‌ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చి…కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసి బొజ్జు పటేల్‌ను విస్మరించడమేంటని రుసరుసలాడుతున్నారట. జిల్లాలో రెండు కీలక పదవులు..తూర్పు ప్రాంతానికి కేటాయించి..పశ్చిమానికి మొండిచేయి చూపించారని అక్కడి కాంగ్రెస్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Story by Kishan, Big Tv 

Related News

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

Big Stories

Advertisement
×