E-Paper
Advertisement

VenkyAnil5: అఫీషియల్.. ఈసారి కూడా మల్టీస్టారరే.. వెంకీతో పాటు ఎవరంటే?

VenkyAnil5: అఫీషియల్.. ఈసారి కూడా మల్టీస్టారరే.. వెంకీతో పాటు ఎవరంటే?
Advertisement

VenkyAnil5: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తదుపరి సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్‌ (Victory Venkatesh)తో మరోసారి అనిల్ రావిపూడి జత కట్టబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే మరో హీరో కూడా ఇందులో చేస్తున్నారని, అది కోలీవుడ్ హీరో కార్తీ అనేలా ఈ మధ్య టాక్ వినబడితే.. వెంటనే అనిల్ రియాక్ట్ అవడం, అలాంటిదేమీ లేదని, అన్ని విషయాలు, అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత నా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ టైమ్ వచ్చేసింది. అనిల్ రావిపూడి అధికారికంగా తన సోషల్ మీడియా వేదికగా, తన తదుపరి సినిమా వివరాలను ప్రకటించారు. ఈసారి ఆయన మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇస్తూ, హీరోల పేర్లు కూడా తెలియజేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Youtuber Komali: అతను నా వాడు కాదని తెలుసు…యూట్యూబర్ కోమలి చివరిగా ఏం రాసిందంటే..!

ఈసారి బొమ్మ కూడా మల్టీస్టారరే..

Advertisement

‘‘మొదటి ‘వందకోట్ల బొమ్మ’ కొట్టిన హీరో.. విక్టరీ వెంకటేష్‌తో, ‘మొదటిసారి బొమ్మ’ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram)తో కలిసి 2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం’’ అని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఐదవ మూవీ ఇది. అలాగే కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఇది. అందుకే ఈ వీడియోలో VenkyAnil5, NKRXAR అంటూ మ్యాసివ్ ఫెస్టివల్ ట్రీట్ రెడీ చేస్తున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. దీంతో ఇన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరపడినట్లయింది. అనిల్ రావిపూడికి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయనతో చేసిన ‘పటాస్’ సినిమాతోనే అనిల్ సక్సెస్ పరంపర మొదలైంది. ఇప్పుడా కృతజ్ఞతను చాటుతూ, ఆయనను ఈ సినిమాలోకి తీసుకొస్తున్నారు అనిల్ రావిపూడి.

Also Read- Puri jagannadh: మరో కోలీవుడ్ హీరోను లైన్ లో పెట్టిన పూరి.. తెలుగు హీరోలను పక్కన పెట్టినట్టేనా?

సంక్రాంతికి సంచలన విజయం

Advertisement

ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీలో మెయిన్ హీరో చిరంజీవి అయినప్పటికీ వెంకీ మామ కూడా ఓ కీలక పాత్రలో అలరించారు. ఇది మల్టీ స్టారర్ కిందే లెక్క. ఇప్పుడు అనిల్ చేయబోయే సినిమా కూడా మల్టీస్టారర్ చిత్రమే కావడంతో పాటు, ఈసారి కూడా మ్యాసివ్ ఫెస్టివల్ ట్రీట్ అంటున్నాడు కాబట్టి.. మరో బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోవచ్చు. మెగాస్టార్‌తో చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేసే సినిమాపై ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. వాటన్నింటికీ సమాధానం అన్నట్లుగా, తాజాగా అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ రావిపూడికి, సంక్రాంతికి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందనడంలో అనుమానమే అవసరం లేదనుకుంటాను.

Also Read- Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×