E-Paper
Advertisement

UP Crime: రూ.1500 కోసం.. ఫ్రెండ్‌ని దారుణంగా చంపి.. మురుగు కాలువలో పడేశాడు

UP Crime: రూ.1500 కోసం.. ఫ్రెండ్‌ని దారుణంగా చంపి.. మురుగు కాలువలో పడేశాడు
Advertisement

UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1500 కోసం తలెత్తిన వివాదం.. స్నేహితుడి హత్యకు దారి తీసింది. నిందితుడు తన ఫ్రెండ్ ను చంపడమే కాకుండా.. శవాన్ని మురికి కాలువలో పడేశాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ కు చెందిన రవీంద్ర, రాహుల్ (35) మంచి స్నేహితులు. సొంతవారు లేకపోవడంతో ఇద్దరు ఫుట్ పాత్ పై జీవిస్తుండేవారు. అయితే గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం 9 గంటల ప్రాంతంలో రవీంద్ర, రాహుల్ మధ్య వివాదం చోటుచేసుకుంది.

Advertisement

రూ.1500 నగదు లావాదేవీకి సంబంధించి ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. కొద్దిసేపటికే ఆ వివాదం హింసాత్మకంగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర చేతికందిన రాయి తీసుకొని రాహుల్ తలపై కొట్టాడు.

రాయి బలంగా తగలడంతో రాహుల్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే స్నేహితుడ్ని రక్షించడానికి బదులు.. రాహుల్ శరీరాన్ని పక్కనే ఉన్న మురుగు కాలువలో పారేశాడు రవీంద్ర. దీంతో రాహుల్ మురికి కాలువలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Also Read: US Crime: అమెరికాలో ఘోరం.. కూతుర్ని దారుణంగా చంపిన.. భారత సంతతి మహిళ

అటుగా వెళ్తున్న స్థానికులు.. కాలువలో మృతదేహం పడి ఉండటాన్ని చూసి వెంటనే నోయిడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాయి. మరోవైపు స్నేహితుడ్ని హత్య చేసిన రవీంద్రను పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు.

Also Read: Air Cooler Deals: సమ్మర్ బొనాంజా.. కూలర్లపై 70% వరకూ డిస్కౌంట్.. లేటు చేశారో చేజారినట్లే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×