శీతాకాలం మొదలైన నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలపు షెడ్యూల్ లో భాగంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ ప్రాంతాలలో దట్టమైన పొగమంచు, లో విజుబులిటీ కారణంగా ప్రతి ఏటా రైళ్లను క్యాన్సిల్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి 2026 మార్చి వరకు 56 రైళ్లను రద్దు చేశాయి. పొగమంచు నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా జలంధర్, జలంధర్ కాంట్ గుండా వెళ్ళే మార్గాల్లో నడిచే 22 రైళ్లు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితమే ముందస్తు ఈ సమాచారం అందించామని, ఈ రద్దు కారణంగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదని వెల్లడించారు.
⦿ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ (12207/12208) – డిసెంబర్ 9 నుంచి ఫిబ్రవరి 24 వరకు రద్దు చేయబడింది.
⦿ యోగ్ నగ్రి జమ్మూ తావి ఎక్స్ ప్రెస్ (14605–14606) – డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 22 వరకు రద్దు చేయబడింది.
⦿ లాల్కువాన్–అమృత్సర్ ఎక్స్ ప్రెస్ (14615/14616) – డిసెంబర్ 6 నుంచి జనవరి 28 వరకు రద్దు చేయబడింది.
⦿ జన్ సేవా ఎక్స్‌ప్రెస్ (14617/14618) – డిసెంబర్ 3 నుంచి మార్చి 2 వరకు రద్దు చేయబడింది.
⦿ కల్కా–శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా ఎక్స్ ప్రెస్ (14503/14504) – డిసెంబర్ 2 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేయబడింది.
⦿ నంగల్ డ్యామ్ ఎక్స్ ప్రెస్ (14505/14506) – డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేయబడింది.
⦿ అమృత్ సర్-చండీగఢ్ ఎక్స్ ప్రెస్ (14541/14542) – డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేయబడింది.
Read Also: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, విమానాలు ఆలస్యం!
⦿ అమృత్‌సర్-అజ్మీర్ ఎక్స్ ప్రెస్ (19611/19614) – డిసెంబర్ 5 నుంచి మార్చి 1 వరకు రద్దు చేయబడింది.
⦿ అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్ (12317/12318) – డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 24 వరకు రద్దు చేయబడింది.
⦿ దుర్గియానా ఎక్స్ ప్రెస్ (12357/12358) – డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేయబడింది.
⦿ న్యూఢిల్లీ- అమృత్‌సర్ ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ (14681/14682) 1 డిసెంబర్ నుంచి 1 మార్చి 2026 వరకు రద్దు చేయబడింది.
పంజాబ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కు శీతాకాల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ప్రయాణీకులు బుకింగ్ చేసుకునే ముందు IRCTC వెబ్ సైట్, NTES యాప్ లో లేటెస్ట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?