E-Paper
Advertisement

Bigg Boss 9 : హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దివ్య నిఖిత, ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా బయటకు

Bigg Boss 9 : హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దివ్య నిఖిత, ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా బయటకు
Advertisement

Bigg Boss 9 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొత్తానికి 12 వారాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సీజన్ మొదట్లో ఇది చదరంగం కాదు రణరంగం అని నాగార్జున చెబుతూ వస్తున్నారు. అలానే ఊహించిన విధంగా కొన్ని ట్విస్టులు కూడా ప్లాన్ చేశారు. అవేవీ ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. కేవలం 5 వారాల్లో హౌస్ నుంచి ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు రాగానే మరో ఆరుగురును వైల్డ్ ఫైర్ స్ట్రోమ్ అంటూ లోపలికి పంపించారు.

వారిలో నలుగురు సెలబ్రెటీలు మరియు ఇద్దరు కామనర్స్. ఏదేమైనా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వెళ్ళిపోవలసిన పరిస్థితి. ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా బయటకు వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం ఈ వారం కూడా ఎలిమినేషన్ దగ్గర పడిపోయింది. ముఖ్యంగా ఈరోజు జరగబోయే ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా ఉండబోతుంది. హౌస్ నుంచి డబల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎలిమినేట్ అయిన దివ్య నిఖిత 

Advertisement

షో స్టార్ట్ అయిన రెండు వారాలు తర్వాత హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది దివ్య. సినిమాలకు రివ్యూలు చెబుతూ బాగా పాపులర్ అయిన దివ్య హౌస్ లోకి వెళ్ళిన తర్వాత హౌస్ మేట్స్ గురించి కూడా రివ్యూ చెప్పింది. ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక పొజిషన్ కూడా ఇచ్చింది.

ఇక ఇన్ని వారాలు కూడా గేమ్ లో కొనసాగుతూ మొత్తానికి నేటితో ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వాస్తవానికి చివరి వారంలో దివ్య మరియు సంజన ఎలిమినేషన్ లో ఉన్నారు. అయితే ఇమ్మానుయేల్ దగ్గర ఉన్న పవర్ వలన ఎలిమినేషన్ లేకుండా ఆ వీక్ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది.

ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ బయటకు 

Advertisement

హౌస్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడగగానే మొదటి వినిపించే పేర్లు ఇమ్మానుయేల్ మరియు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు సుమన్ శెట్టి. హౌస్ లో కూడా సుమన్ శెట్టి గేమ్ ఆడే తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది.

సుమన్ శెట్టి ఎప్పుడు ఎలిమినేషన్ కి వచ్చినా కూడా చాలామంది ఓట్స్ తో సేవ్ చేశారు. అయితే ఈరోజు మేల్ మరియు ఫిమేల్ ఎలిమినేషన్ జరిగినట్లు సమాచారం వినిపిస్తుంది అందులో భాగంగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ మీద చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.

Also Read: Akhanda 2 Event : సినిమాలో సంయుక్త పాత్ర పూర్తిగా ఉండదు, స్పీచ్ కూడా మధ్యలో ఆపేస్తే ఎలా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×