E-Paper
Advertisement

Suresh Kumar: ప్రముఖ నటుడు సురేశ్ కుమార్ కన్నుమూత..శోక సంద్రంలో టాలీవుడ్..!

Suresh Kumar: ప్రముఖ నటుడు సురేశ్ కుమార్ కన్నుమూత..శోక సంద్రంలో టాలీవుడ్..!
Advertisement

Suresh Kumar: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సురేశ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి వార్త సినిమా రంగంలోనూ..అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని కలిగించింది. సురేశ్ కుమార్ నటుడిగా మాత్రమే కాకుండా.. మంచి వృత్తి నైపుణ్యం కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.

సురేశ్ కుమార్ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పని చేశారు. దేశీయంగా.. అంతర్జాతీయంగా ఉన్న పలు మల్టీనేషనల్ బ్యాంకుల్లో ఆయన అత్యున్నత పదవుల్లో సేవలందించారు. ఉద్యోగ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో పని చేసి మంచి పేరు సంపాదించారు.

Advertisement

అయితే చిన్నప్పటి నుంచే ఆయనకు నటనపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో సినిమాల వైపు అడుగులు వేశారు. ఉద్యోగ బాధ్యతల మధ్య కూడా తన అభిరుచిని వదలకుండా చిత్ర రంగంలో అవకాశాలు పొందారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సురేశ్ కుమార్ హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో నటించి తన ప్రతిభను చూపించారు. భాష ఏదైనా పాత్రలో ఒదిగిపోవడం.. ఆయన ప్రత్యేకత. తెలుగులో ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ‘
మహా నటి, గోల్కొండ హైస్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు..వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

Advertisement

చిన్న పాత్ర అయినా.. కీలక పాత్ర అయినా దానికి పూర్తి న్యాయం చేసే నటుడిగా సురేశ్ కుమార్ పేరు నిలిచింది. ఆయన మరణంతో సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఆయన మృతి తీరని లోటు అని చెప్పవచ్చు. సురేశ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ALSO READ: MSVPG Film: ‘ మన శంకర వరప్రసాద్ గారు’ కి సీక్వెల్ ఉందా? ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×