E-Paper
Advertisement

BSNL బొనాంజ.. తెరపైకి మళ్లీ రూ.1 ప్లాన్, కొత్తగా డైలీ 3 జీబీ డేటా ఆఫర్ కూడా.. లాస్ట్ డేట్ ఇదే!

BSNL బొనాంజ.. తెరపైకి మళ్లీ రూ.1 ప్లాన్, కొత్తగా డైలీ 3 జీబీ డేటా ఆఫర్ కూడా.. లాస్ట్ డేట్ ఇదే!
Advertisement

కస్టమర్లకు BSNL గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల క్రిస్మస్, న్యూఇయర్‌‌ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వీటికి కస్టమర్ల నుంచి మంచి ఆధరణ లభిస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా డైలీ 3 జీబీ డేటా అందించే ప్లాన్‌ను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

0.5 నుంచి 3 జీబీ వరకు డేటా

BSNL తమ పోటీ సంస్థలకు ధీటుగా కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే కోటి మంది వరకు వినియోగదారులను తమ ఖాతాలో వేసుకుంది. వారికి మరిన్ని సేవలను విస్తరించే ఉద్దేశంతో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన ‘హాలీడే బొనంజా’ ద్వారా BSNL 0.5 జీబీ డేటాను అదనంగా అదిస్తోంది. అంటే మీరు ఏ రిఛార్జ్ ప్లాన్ చేసుకున్నా.. దానికి అదనంగా 0.5 జీబీ డేటాను BSNL అందిస్తుంది. STV 225, STV 347, STV 485, PV 2399 ప్లాన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, ఈ ఆఫర్ జనవరి 4వ తేదీ వరకే అని BSNL అప్పట్లో వెల్లడించింది. తాజా ప్రకటన ప్రకారం.. రూ.225 రీఛార్జ్ ప్లాన్‌కు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. మిగతా ప్లాన్స్ కూడా అధికారికంగా చెప్పలేదు. మిగతా ప్లాన్స్ చేసుకొనే ముందు ఆఫర్‌ను చెక్ చేసుకోండి.

రూ.225 ప్లాన్ ద్వారా ఏం లభిస్తాయి?

Advertisement

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు జనవరి 31 లోగా రూ.225 ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకున్నట్లయితే డైలీ 3జీబీ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్‌లో ఇంకా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 డైలీ ఎఎస్ఎస్‌లు లభిస్తాయి.

ఈ ఆఫర్లు కూడా మిస్ కావద్దు

రూ.1కే డైలీ 2 జీబీ డేటా: BSNL మరో సూపర్ పాపులర్ ప్లాన్‌ను కూడా డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం రూపాయికే ఉచిత సిమ్ కార్డుతోపాటు.. డైలీ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ అందివ్వనుంది. ఈ ఆఫర్‌కు మంచి ఆధరణ లభించడంతో మంగళవారం మరోసారి ఈ ఆఫర్‌ను కొనసాగిస్తున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించింది. ఈ ఆఫర్, సిమ్ కోసం కస్టమర్లు దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని ప్రకటించింది.

Advertisement

100 జీబీ డేటా: ఇంటర్నెట్ లవర్స్ కోసం BSNL మంగళవారం మరో ప్లాన్ కూడా ప్రకటించింది. జస్ట్ రూ.251 చెల్లిస్తే చాలు.. 30 రోజుల కోసం డైలీ 100 జీబీ హైస్పీడ్ డేటా అందిస్తామని వెల్లడించింది. దీనితోపాటు ఉచితంగా BiTV, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. దీని వ్యాలిటీ కూడా 30 రోజులు. ఈ ఆఫర్ ఆఖరి తేదీ జనవరి 31.

Also Read:  రూ.349 ధరలో జియో సూపర్ ప్లాన్.. ఫ్రీ ఓటీటీ, జియో టివి, రూ.35100 అతిపెద్ద బెనిఫిట్ కూడా

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×