E-Paper
Advertisement

Eko OTT : ‘ఎకో’ హిందీ వెర్షన్ మిస్సింగ్… ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

Eko OTT : ‘ఎకో’ హిందీ వెర్షన్ మిస్సింగ్… ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Advertisement

Eko OTT : మలయాళ సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఎకో’ (Eko). ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కానీ హిందీ బెల్ట్‌ లోని ప్రేక్షకులు ఇంకా ఈ చిత్రాన్ని చూడలేకపోవడం నిరాశను కలిగిస్తోంది. మరి ఇంతకీ ఈ మూవీ హిందీ వెర్షన్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం పదండి.

హిందీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

గత సంవత్సరం మలయాళ చిత్రసీమ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎకో’తో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు. చాలా కాలం వెయిటింగ్ తర్వాత, రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అయ్యింది. జనవరి 3 నుంచి ఈ మూవీ కేవలం మలయాళం భాషల్లోనే అందుబాటులో ఉంది. దీంతో మిగతా భాషల ఆడియన్స్ కు వెయిటింగ్ తప్పలేదు. కానీ కొన్ని రోజుల్లోనే మిగతా భాషల్లో సైతం సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కానీ ఇంకా హిందీ ఆడియన్స్ మాత్రం నిరీక్షణలోనే ఉన్నారు. ‘ఎకో’ 2025 నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌ తో నిర్మితమైన ఈ మూవీ 45 నుండి 50 కోట్లు వసూలు చేసింది. 2025లోనే బెస్ట్ సూపర్ హిట్ మలయాళ చిత్రాలలో ఇది కూడా ఒకటి. జనవరి 7 నుండి నెట్ ఫ్లిక్స్ లోనే హిందీ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు IMDbలో 8.2 రేటింగ్‌ ఉంది. 2 గంటల 5 నిమిషాల ఈ చిత్రం మంచి థ్రిల్లింగ్ ట్విస్టులతో పాటు, ఉత్కంఠభరితంగా ఉంటుంది.

Advertisement

Read Also : బ్యాంక్ సేఫ్ ను బద్దలు కొట్టడానికి మైండ్ బెండింగ్ ప్లాన్… వీడి ధైర్యానికి దండం పెట్టాలి భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

దట్టమైన అటవీ ప్రాంతం కాట్టుకున్ను. ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. అక్కడే ఊరికి దూరంగా ఉన్న ఒక కొండపై ఒకే ఒక్క ఇల్లు ఉంటుంది. మిలాతీ (బియానా మోమిన్) అనే ముసలావిడ ఒక్కతే అక్కడ నివాసం ఉంటుంది. అలా ఆ కొండపై ఒంటరిగా ఉండిపోకుండా, కిందనున్న గ్రామంలోకి వెళ్ళి, జనాలతో కలవాలని ఆమె కొడుకులు ఎంతగానో చెప్పి చూస్తారు. కానీ ఫలితం ఉండదు. ఇక చేసేదేం లేక ఆమె కుమారులు ముసలావిడ బాగోగులు చూడడానికి పీయోస్‌ (సందీప్ ప్రదీప్) అనే కేర్ టేకర్ ను నియమిస్తారు.

Advertisement

ఆమె ఒక్కతే అక్కడ ఉండడం ప్రమాదకరం. కానీ ఎవ్వరూ కొండపై కాలు పెట్టే ధైర్యం చేయకుండా ఉండడానికి మలేషియన్ బ్రీడ్‌ కుక్కలు కాపలా కాస్తూ ఉంటాయి. కొన్నాళ్ళ కిందట మిలాతి భర్త కురియాచన్‌ (సౌరభ్‌ సచ్‌దేవ్‌) కూడా అక్కడే ఉండేవాడు. కానీ ఆయన ఓ క్రిమినల్‌ కేసులో ఇరుక్కోగా, పోలీసుల నుంచి తప్పించుకుని దొరక్కుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇక అతడి కోసం పోలీసులే కాదు మరికొంత మంది వ్యక్తులు కూడా వెతుకుతారు. ఈ నేపథ్యంలోనే మోహన్ పోతన్ (వినీత్) అనే కురియాచన్‌ ఫ్రెండ్ అడవిలో హత్యకు గురవుతాడు. మరి అతనెలా చనిపోయాడు ? కురియాచన్‌ ఏమైపోయాడు ? మితిలా ఎందుకు ఆ కొండపైనే ఉంటోంది ? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన విషయం.

Tags

Related News

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×