E-Paper
Advertisement

Victory Venkatesh: సంక్రాంతికి ముగ్గురు మెగా బ్రదర్స్‌తో వెంకటేష్…అరుదైన రికార్డ్

Victory Venkatesh: సంక్రాంతికి ముగ్గురు మెగా బ్రదర్స్‌తో వెంకటేష్…అరుదైన రికార్డ్
Advertisement

Victory Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అంతేకాకుండా వెంకటేష్ సోలోగా సంక్రాంతికి వచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకున్నారు. ఈసారి సంక్రాంతికి ఈయన సోలోగా రాకపోయినా చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కామియో రోల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి వెంకటేష్ కి.. ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
అనిల్ రావిపూడి పైన ప్రేమతోనే వెంకటేష్ చిరంజీవి సినిమాలో క్యామియోకి ఒప్పుకున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి.

ఈ క్రమంలో వెంకటేష్, మెగా హీరో చిరంజీవి కాంబినేషన్.. గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సంక్రాంతి సినిమాల విషయంలో వెంకటేష్.. ఈ సంవత్సరంతో మెగా కుటుంబంలోని.. అన్నదమ్ములందరితో కలిసి నటించడం పూర్తి చేశారన్న టాక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

అసలు విషయానికి వస్తే.. మెగా హీరోలతో సంక్రాంతికి వెంకటేష్ ప్రయాణం 2013లో మొదలైంది. ఆ ఏడాది వెంకటేష్..మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి షాడో.. సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ..మెగా కుటుంబంతో వెంకటేష్ అనుబంధానికి అది మొదటి అడుగుగా నిలిచింది.

ఇక ఆ తర్వాత 2015లో వెంకటేష్ మరో మెగా బ్రదర్ తో నటించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల.. సినిమాలో వెంకటేష్ నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్..వెంకటేష్ కాంబినేషన్‌కు మంచి స్పందన వచ్చింది.

Advertisement

ఇప్పుడు 2025 సంక్రాంతికి..మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం వెంకటేష్‌కు దక్కింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు.. సినిమాలో వెంకటేష్ ఒక ప్రత్యేకమైన క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ ఒక్క పాత్రతోనే మెగా బ్రదర్స్ ముగ్గురితో.. వెంకటేష్ కలిసి నటించినట్లవుతుంది. అందుకే ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇక మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి బజ్ కనిపిస్తోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా పెరుగుతున్నాయి. విడుదలకు ముందే నార్త్ అమెరికాలో ఈ సినిమా టికెట్ అమ్మకాలు దాదాపు 1 మిలియన్ డాలర్లకు చేరువవుతున్నాయన్న వార్తలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి అంచనాలు పెంచుతోంది.

మొత్తానికి ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో ఇది ఓ ప్రత్యేకమైన ఘట్టం. సంక్రాంతి సినిమాలతో మెగా కుటుంబంతో ఉన్న అనుబంధం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అందుకే ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ALSO READ: Venkatesh: త్రివిక్రమ్ కి నో చెప్పిన వెంకటేష్… కారణం ఏంటంటే..

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×