E-Paper
Advertisement

Bandla Ganesh: రిలీజ్ ముందు రోజు నిర్మాతను పిలిచి సెటిల్ చేశాడు, అది చరణ్ క్యారెక్టర్

Bandla Ganesh: రిలీజ్ ముందు రోజు నిర్మాతను పిలిచి సెటిల్ చేశాడు, అది చరణ్ క్యారెక్టర్
Advertisement

Bandla Ganesh: ఈరోజుల్లో ఒక సినిమాను నిర్మించి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం అనేది సాధారణమైన విషయం కాదు. సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచి పూర్తయ్యే వరకు ఒక రకమైన మినీ యుద్ధమే చేయాలి. సినిమా షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత కూడా విపరీతమైన అడ్డంకులు వస్తాయి అని రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ పరిణామాలు జరుగుతున్నది కేవలం చిన్న సినిమాకు కాదు, సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు నేడు సమస్యలు ఎదురయ్యాయి.

సినిమా కాపీ పూర్తయిపోయి థియేటర్లకు చేరిపోయిన తర్వాత కూడా ఆ సినిమాకి అడ్డంకులు మొదలయ్యాయి. గంటలో ప్రీమియర్స్ మొదలవుతాయి అనగానే షోలు క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉండటంవలనే ఈ సినిమా రిలీజ్ ఆగిపోయినట్లు పలు రకాల వార్తలు వినిపించాయి. ఈ సందర్భంలో బండ్ల గణేష్ రామ్ చరణ్ గురించి చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రామ్ చరణ్ పిలిచి సెటిల్ చేశాడు 

Advertisement

గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు బండ్ల గణేష్. ఇప్పటికీ కూడా బండ్ల గణేష్ నిర్మాతగా ప్రస్తావన వస్తే గబ్బర్ సింగ్ పేరే వినిపిస్తుంది. ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు బండ్ల గణేష్.

రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన సినిమా గోవిందుడు అందరివాడేలే. ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. మొత్తానికి ఆ సినిమా విడుదలై కొంతమేరకు మంచి పేరు సాధించుకుంది.

Advertisement

ఆ సినిమా విడుదలకు ముందు రోజు బండ్ల గణేష్ చాలామందికి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఆ తరుణంలో రామ్ చరణ్ బండ్ల గణేష్ ను ఇంటికి రమ్మని పిలిచారు. ఇంటికి రమ్మని పిలిచిన వెంటనే బండ్ల గణేష్ చాలా టెన్షన్ పడిపోయాడు.

అప్పటికే హీరో రెమ్యూనరేషన్ రెండు కోట్లు బాకీ ఉన్నాడు. రేపు సినిమా రిలీజ్ కాబట్టి బండ్ల గణేష్ ను ఆ రెండు కోట్లు రామ్ చరణ్ అడుగుతారేమో అని అనుకున్నాడు చాలా టెన్షన్ కు గురి అయ్యి రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడు.

ముందు సినిమా రిలీజ్ చెయ్ 

రామ్ చరణ్ ఇంటికి పిలిచిన తర్వాత విషయం కనుక్కున్నారు. రేపు సినిమా రిలీజ్ కాబట్టి ముందు వాళ్లకు క్లియర్ చేయి రెమ్యూనరేషన్ గురించి మనం తర్వాత చూసుకుందాం అంటూ టీ ఇచ్చి బిస్కెట్లు పెట్టి చాలా ధైర్యాన్ని ఇచ్చి రామ్ చరణ్ బండ్ల గణేష్ ను పంపించారు.

దీనినే ప్రస్తావిస్తూ 30 సంవత్సరాల కుర్రాడికి ఉన్న మెచ్యూరిటీ అది. అందుకే రామ్ చరణ్ ఉన్నతమైన మనిషి అంటూ మాట్లాడారు. అలానే ఎన్టీఆర్ కూడా బానే నిలబడ్డారు అంటూ చెప్పాడు బండ్ల గణేష్. అఖండ సినిమాకి సంబంధించిన వివాదం జరుగుతున్న తరుణంలో ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: The Rajasaab : ప్రభాస్ రాజా సాబ్ ఓటీటీ డీల్ సెట్, భారీ రేట్ కు కొనుగోలు చేసిన ఆ సంస్థ

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×