E-Paper
Advertisement

Nayanthara: ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేశ్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Nayanthara: ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేశ్.. ఎన్ని కోట్లో తెలుసా..?
Advertisement

Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తమిళ సినిమాలతో పాటుగా తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఈమధ్య సినిమాలకన్న ఎక్కువగా వివాదాల్లో ఈమె పేరు వినిపిస్తూ వచ్చింది.. ఎవరెన్ని అనుకుంటే నాకేంటి అని నయనతార అన్ని లైట్ తీసుకుంది. ఇకపోతే కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తన పిల్లల బాగోగులను చూసుకోవడంతో పాటుగా, వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తుంది. నయనతార కు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ప్రతి ఏడాది పుట్టినరోజు కు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది ఆమెకు ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారు… ఆ కారు ఖరీదు? ప్రత్యేకతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

భార్య ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన విఘ్నేశ్..

నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నాలుగు పదుల వయసులో కూడా నయన తార వరుసగా సినిమాలు చేస్తుంది. ఆమె రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకుంది.. ఈసారి నయన్ తన పుట్టినరోజుని సింపుల్‌గా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. భర్త విఘ్నేశ్ నుంచి గిఫ్ట్ మాత్రం చాలా ఖరీదైనది వచ్చింది.. ప్రతి పుట్టినరోజుకి ఆమె భర్త ఖరీదైన కార్లను ఆమెకు గిఫ్ట్ గా ఇస్తూ వస్తున్నాడు. ఈయన 2023లో రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెజ్ మేబాచ్, 2024 గతేడాది రూ.5 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 కారుని ఇచ్చాడు.. కానీ ఈ సారి మాత్రం 10 కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్ర కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు భర్తకి నయనతార అంటే ఎంత ప్రేమ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ అంతా ఆ సినిమాపైనే..

నయనతార సినిమాల విషయానికొస్తే.. 

స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కథలు ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శివశంకరవరప్రసాద్’ మూవీ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీకి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ కొత్త సినిమా, యష్ ‘టాక్సిక్’తో పాటు తమిళ, మలయాళ చిత్రాలు చెరో రెండు ఉన్నాయి.. మొత్తానికి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలన్నీ కూడా వచ్చేయడాది థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటాయని ఆమె అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న నయనతార.. తన ఫ్యామిలీ ఫోటోలను, పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

Advertisement

 

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×