E-Paper
Advertisement

Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..
Advertisement

Crime News: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణీత అనే విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపాల్‌కు తెలిపగా.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురి మరణ వార్తతో తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకున్నారు. విగత జీవిగా పడివున్న తమ కూతురిని చూసి బోరున విలపించారు. బాలికది కావలి మండలం అటవీరాజుపాలెంగా ప్రిన్సిపల్‌ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రణీత కావలి మండలం అటవీరాజుపాలెం గ్రామానికి చెందినది. ఆమె తండ్రి కొండాపురం మండల ఎంఈఓగా పనిచేస్తున్నారు. పేదలకు ఉచిత విద్య అందించే జవహర్ నవోదయ విద్యాలయంలో చేరిన ప్రణీత బాగా చదువుతూ, విద్యార్థులలో ప్రత్యేక గుర్తింపు పొందినవారిలో ఒకరిగా ఉండేది. కానీ, ప్రణీత అర్థరాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో అటు వైపుగా ఆయా.. వెళ్ళి చూడగా.. ప్రణీత ఫ్యాన్‌కు వెళాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనా ఆయా వెళ్లి ప్రిన్సిపాల్‌కి తెలియజేసింది. దీంతో ప్రిన్సిపాల్ వారి తల్లిదండ్రులకు సమాచారం తెలియజేసింది.

Advertisement

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే కృష్ణాపురం నవోదయ విద్యాలయానికి చేరుకున్నారు. తమ కూతురు విగతజీవిగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి బాధలో కుంగిపోయారు. “మా కూతురు ఎందుకు ఇలా చేసుకుంది? ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పాల్సింది” అంటూ బోరున విలపించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, “ప్రణీత మంచి విద్యార్థిని. ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని అనుకున్నాం. కానీ, ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదు అని చెప్పారు.

Also Read: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మోదీ, చంద్రబాబు, పవన్

Advertisement

అలాగే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మర్రిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రణీత ఎందుకు చనిపోయింది.. ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా..? లేదా ఎవరైనా వేధింపుల కారణంగా ఇలా చేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×