Divvala Madhuri: తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఊహించిన విధంగా ఎన్నికల ఫలితాలు వెలవడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన ఎంతో మంది రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీవీకి పార్టీ (TVK Party)అధినేత విజయ్(Vijay) కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. టీవీకే పార్టీ స్థాపించిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నికలలో భారీ విషయం అందుకోవడంతో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా త్రిష కల నెరవేరింది అంటూ చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. అయితే తాజాగా దివ్వెల మాధురి(Divvala Madhuri) విజయ్ గెలుపు గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలలో విజయ్ భారీ మెజారిటీతో ముందంజలో ఉన్న నేపథ్యంలో దివ్వెల మాధురి ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేస్తూ..”త్రిష(Trisha) కోరికతో పాటు టీవీకే విజయ్ గెలవాలన్న నా కోరిక కూడా నెరవేరింది.. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు ముడిపడి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు రాజకీయాలు చేయలేరు. కంగ్రాట్యులేషన్స్ విజయ్ గారు” అంటూ ఈమె పోస్ట్ చేశారు.
ఈ విధంగా మాధురి విజయ్ గెలుపు గురించి ప్రస్తావిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేయడమే కాకుండా విజయ్ గెలవడం త్రిష కోరిక అని ప్రస్తావించడమే కాకుండా రాజకీయాలకు వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు అంటూ ఈమె మాట్లాడటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇక మాధురి పోస్టుపై నెటిజెన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మాధురి దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే .తన భార్య నుంచి విడిపోయిన దువ్వాడను మాధురి వివాహం చేసుకున్నారు.
వెండితెరకు విజయ్ దూరం..
ఇక త్రిష సైతం విజయ్ తో రిలేషన్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దువ్వాడ మాధురి ఇలాంటి పోస్ట్ చేసి ఉంటారు అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఈమె పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమిళనాడు ఎన్నికలలో ఊహించని విధంగా విజయ్ అద్భుతమైన మెజారిటీని సాధించడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో విజయ్ గెలుపును అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండబోతున్నారని ఇక వెండి తెరపై విజయ్ ను చూడటం అసాధ్యమని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: రాజమౌళి, ప్రభాస్ పై జగపతి బాబు కామెంట్స్.. పేరుకే స్టార్స్ కానీ?