Film industry: వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తారలు, ప్రజా క్షేత్రంలోనూ అదే రేంజ్‌లో సత్తా చాటుతున్నారు. నాడు ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి నేటి దళపతి విజయ్ వరకు.. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రభంజనం సృష్టించిన హీరోలు ఎందరో ఉన్నారు. కేవలం గ్లామర్‌తోనే కాకుండా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని చట్టసభలకు ఎన్నికైన ఈ సెలబ్రిటీల పొలిటికల్ ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ‘రీల్’ హీరోలు ‘రియల్’ పొలిటికల్ సక్సెస్ సాధించిన హీరోలు చూద్దాం..
తెలుగు రాజకీయాల్లో ఎన్టీ రామారావు సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని ఆయన రికార్డ్ సృష్టించారు. సరిగ్గా ఇప్పుడు తమిళనాట దళపతి విజయ్ అదే స్థాయిలో దూసుకుపోతున్నారు. తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ పెట్టిన 14 నెలల్లోనే మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంటూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసేందుకు పదేళ్ల పాటు ఓపికగా పోరాడారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఘనవిజయం సాధించడమే కాకుండా, తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి కింగ్ మేకర్‌గా నిలిచారు. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. ఆయన తన మొదటి ఎన్నికల్లోనే, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ అదే నియోజకవర్గంలో వరుస విజయాలు సాధిస్తూ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇక వీరి బాటలోనే మురళీ మోహన్ లాంటి వారు కూడా ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేశారు.
దక్షిణాది రాజకీయాల్లో సినిమా తారల హవా ఎంజీ రామచంద్రన్ (MGR) తోనే మొదలైందని చెప్పొచ్చు. ఆయన అప్పట్లో వరుసగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. ఆయన వారసురాలిగా వచ్చిన జయలలిత కూడా నటిగా ఎంత గుర్తింపు పొందారో, రాజకీయాల్లోనూ అంతకంటే ఎక్కువ పవర్ చూపించారు. ఏకంగా ఆరు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా నిలిచిపోయారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 234 స్థానాలున్న అక్కడ 118 సీట్లు వస్తే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అధికార డీఎంకే కూటమి కంటే విజయ్ పార్టీ ముందంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరికొద్ది సేపట్లో వచ్చే ఫలితాలతో విజయ్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కుతారో లేదో తేలిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం.. వెండితెర వీరులు రాజకీయ యుద్ధ క్షేత్రంలోనూ విజేతలుగా నిలుస్తున్నారు.
also read:ఎన్నికల ఫలితాల్లో ముందంజ.. విజయ్ ఇంటికి త్రిష!
సినిమా గ్లామర్ అనేది రాజకీయాల్లోకి రావడానికి ఒక దారి మాత్రమే. కానీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే ఎన్టీఆర్, ఎంజీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి వారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా అదే దారిలో కనిపిస్తున్నారు. ఇక కేవలం సెలబ్రిటీ హోదా మాత్రమే కాకుండా, ప్రజల సమస్యలపై పోరాడే తత్వం ఉన్నప్పుడే ఏ హీరో అయినా రాజకీయాల్లో ‘సూపర్ స్టార్’ అవుతాడని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల పూర్తి క్లారిటీ వస్తే.. సౌత్ ఇండియాలో మరో పొలిటికల్ సెన్సేషన్ నమోదైనట్లే!