Vijay Devarakonda and Rashmika Marriage Fix: విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఇవాళ(జూలై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే విజయ్ నటన,లుక్కి మాత్రం విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ ఈ రౌడీ బాయ్ ఫ్యాన్స్ అంత ఫుల్ జోష్లో ఉన్నారు. థియేటర్ల ముందు తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ నుంచి ఫ్యాన్స్కి మరో శుభవార్త రాబోతోందట. మరికొన్ని రోజుల్లో విజయ్ పెళ్లి కబురు చెప్పబోతున్నాడట. అవును.. విజయ్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట.
కొన్నేళ్లుగా సీక్రెట్ డేటింగ్
ఇక వధువు ఎవరనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా. అవును.. అందరు అనుకున్నట్టే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా వీళ్లిద్దరు రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు డైరెక్టగా చెప్పకపోయినా.. ఎన్నో సందర్భాల్లో హింట్ ఇస్తూ వస్తున్నారు. జంటగా విందువినోదాలకు,వెకేషన్స్ వెళ్లడం.. అక్కడ ఫోటోలు షేర్ చేయడం.. ఒక దగ్గర ఉండి కూడా వేరువేరుగా పోస్టులు పెట్టి దొరికేయడం వంటి చేస్తూ వస్తున్నారు. అయితే కావాలనే వారు చేస్తున్నారన్నది అందరి సందేహం. వీరద్దరు రిలేషన్లో ఉన్నట్టు నేరుగా చెప్పకుండ ఇలా హింట్ ఇస్తున్నారనే అందరి అనుమానాలు. ఇక రష్మిక కూడా పలు ఈవెంట్స్ విజయ్తో రిలేషన్పై పరోక్షంగా కన్ఫాం చేసింది.
దేవరకొండ కోడలినని..
పుష్ప 2 ప్రమోషన్స్లో భాగంగా మీరు పెళ్లి ఎప్పుడు.. మీరు చేసుకునే వ్యక్తి ఇండస్ట్రీ అతనేనా అని అడగ్గా.. ఆ విషయం వాళ్లందరికి తెలుసు? అంటూ కన్నుగీటింది. ఇంకేముందు అంతా రౌడీ రౌడీ అని అరవడం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు విజయ్ తమ్ముడితో.. అరేయ్ నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ.. దేవరకొండ ఇంటి కోడలినని చెప్పకనే చెప్పింది. వీరద్దరు రిలేషన్లో ఉన్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతున్న విజయ్ కానీ, రష్మిక కానీ ఎప్పుడు ఖండించలేదు. దీంతో విజయ్-రష్మికలు ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. రిలేషన్పై ప్రశ్న ఎదురైనప్పుడు.. తాను సింగిల్ కాదని కన్ఫాం చేస్తూ వస్తున్న విజయ్.. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట.
సెప్టెంబర్ లో పెళ్లి?
ఈ సెప్టెంబర్లో విజయ్-రష్మికలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. మొన్నటి వరకు కింగ్డమ్ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు విజయ్. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రస్తుతం ఫ్రీ అయ్యాడు.ఇటూ రష్మిక కూడా తన సినిమా షూటింగ్స్ని దాదాపు పూర్తి చేసుకుందట. ఇక ఇద్దరు ప్రస్తుతం షూటింగ్స్ రిలీఫ్ అయ్యారు. ఇదే టైంలో పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. వీరి కుటుంబాలు కూడా వీరిద్దరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లి ముహుర్తలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఈ సెప్టెంబర్లోనే మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుని పెళ్లి రెడీ అయ్యారట.
Also Read: Siddharth-Aditi Rao: సిద్ధార్థ్-అదితి రావు విడాకులు! – కారణాలు ఇవేనా?