Siddharth and Aditi Rao Hydari Divorce: టాలీవుడ్లో ఓ జంట విడాకులకు సిద్దమైందట. పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే విడాకులు తీసుకునే దిశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లి. ఎంతోకాలంగా రిలేషన్ ఉన్న వీరు గతేడాది సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ జంట ఎవరో గర్తుపట్టారా. అవును వారే హీరో సిద్దార్థ్, అతిథి రావ్ హైదరిలే. వీరిద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అభిమానులంత ఆశగా ఎదురుచూశారు. చివరిక గతేడాది పెళ్లి చేసుకుని ఫ్యాన్స్కి తీపి కబురు అందించారు.
గతేడాదే పెళ్లి
పెళ్లి అనంతరం వీరు జంటగా ఎక్కడ కనిపించిన అన్యోన్యంగా కనిపించారు. వీరిద్దరి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ చూసి మురిసిపోయారు. మొన్నటి వరకు కూడా సిద్దార్థ్ అదితి తన అదృష్ట దేవత అంటూ కొనియాడాడు. కానీ, ఇప్పుడు వీరు విడాకులు తీసుకుబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు బి–టౌన్లో వీరి విడాకుల చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య అదితి ఎక్కడికి వెళ్లిన ఒంటరిగా కనిపిస్తోంది. సిద్దార్థ్ ఇటీవల నటించిన 3BHK మూవీ ప్రమోషన్స్ ని సింగిల్గా చేసుకున్నాడు. ఎక్కడ కూడా అదితి కనిపించలేదు.
ఏడాది తిరక్కుండానే విడాకులు?
దీంతో వీరి మధ్య ఏం జరుగుతుందని ఆరా తీయగా ఈ విడాకులు విషయం బయటకు వచ్చిందట. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ జంట అభిమానులను మాత్రం ఈ న్యూస్ బాధిస్తోంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ ఈ జంట ఫ్యాన్స్, సన్నిహతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజమేంతుందో తెలియదు. కానీ, ప్రస్తుతం సిద్ధార్థ్–అదితి రావు హైదరి డైవోర్స్ న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే స్వయంగా సిద్ధార్థ్, అదితిలు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
వనపర్తి గుడిలో సింపుల్ గా పెళ్లి
కాగా సిద్ధార్థ్, అదితిలకు ఇది రెండో పెళ్లి అనే విషయంలోనే గతంలోనే వీరికి విడివిడిగా పెళ్లయి, విడాకులు అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరు తమ సినీ కెరీర్తో బిజీగా ఉన్నారు. 2017లో సముద్రం చిత్రంలో తొలిసారి జంటగా నటించారు. ఈ మూవీ టైంలో వీరికి పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. ఏమిదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరు 2024లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సెప్టెంబర్ 16న వరంగల్లోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. పెళ్లయి ఏడాది కూడా కాకుండానే వారి విడాకులు వార్తలు వినిపించడం ప్రతి ఒక్కరిని షాకిస్తోంది.
Also Read: Ravi Teja ART Theatre: రవితేజ ART సినిమాస్ లోపల ఎలా ఉందో చూశారా? చూస్తే అబ్బా.. అనాల్సిందే!